Sunrisers Hyderabad, SRH, IPL , IPL 2025
IPL 2025: Pat Cummins: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఏడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయాన్ని అందుకుంది. పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, ఈ కంగారూ ఆల్ రౌండర్ గొప్ప రికార్డును సృష్టించాడు. ఎంఎస్ ధోని, కీరన్ పొలార్డ్ వంటి దిగ్గజాలను వెనక్కినెట్టాడు.
Sunrisers Hyderabad all-rounder Pat Cummins creates new history in IPL, surpassing Kieron Pollard and MS Dhoni
హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన ప్యాట్ కమ్మిన్స్
ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన రెండో అర్ధ సెంచరీ సాధించిన రికార్డు పాట్ కమిన్స్ పేరిట ఉంది. పాట్ కమ్మిన్స్ 2022లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 14 బంతుల్లో 50 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025 లో కూడా మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి రికార్డు సృష్టించాడు.
హైదరాబాద్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై కేవలం 4 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో తన రెండవ మ్యాచ్ ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ 6వ వికెట్ పడిపోయిన తర్వాత కేవలం 4 బంతులు మాత్రమే ఆడాడు. మొదటి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత నాల్గవ బంతికి ఔటయ్యాడు.
Sunrisers Hyderabad all-rounder Pat Cummins creates new history in IPL, surpassing Kieron Pollard and MS Dhoni
ఐపీఎల్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్ గొప్ప రికార్డు
ఐపీఎల్ కెప్టెన్‌గా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన రికార్డు కమిన్స్ నెలకొల్పాడు. ఈ విషయంలో కమ్మిన్స్ దిగ్గజ ప్లేయర్లు ఎంఎస్ ధోని, కీరన్ పొలార్డ్, రవిచంద్రన్ అశ్విన్‌లను అధిగమించాడు. అలాగే, ఐపీఎల్‌లో తన మొదటి మూడు బంతుల్లో సిక్స్‌లు కొట్టిన నాల్గవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మొదటి మూడు బంతుల్లో సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్లు
సునీల్ నరైన్ (KKR) vs RCB, షార్జా, 2021
నికోలస్ పూరన్ (LSG) vs SRH, హైదరాబాద్, 2023
MS ధోని (CSK) vs MI, ముంబై, 2024
పాట్ కమ్మిన్స్ (SRH) vs LSG, హైదరాబాద్, 2025
Sunrisers Hyderabad all-rounder Pat Cummins creates new history in IPL, surpassing Kieron Pollard and MS Dhoni
కెప్టెన్‌గా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయర్లు
450 - పాట్ కమ్మిన్స్ (SRH) vs LSG, హైదరాబాద్, 2025
425 - రవిచంద్రన్ అశ్విన్ (PBKS) vs RR, మొహాలీ, 2019
400 - MS ధోని (CSK) vs LSG, చెన్నై, 2023
400 - కీరన్ పొలార్డ్ (MI) vs RCB, అబుదాబి, 2020