హెడ్‌కోచ్‌వి నువ్వే అలా అంటే ఎలా..? ద్రావిడ్‌ కామెంట్స్‌పై సన్నీ ఆగ్రహం

Published : Jun 12, 2023, 11:49 AM IST

WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భారత జట్టు  దారుణ పరాభవం   టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్  ద్రావిడ్ పై కూడా గట్టిగానే పడింది.   ఈ ఓటమికి అతడు కూడా కారణమే అంటున్నాడు సునీల్ గవాస్కర్.. 

PREV
16
హెడ్‌కోచ్‌వి నువ్వే అలా అంటే ఎలా..? ద్రావిడ్‌ కామెంట్స్‌పై  సన్నీ ఆగ్రహం

డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆసీస్ చేతిలో  టీమిండియా ఓడిపోవడంతో  భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాళ్ల ఆటతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తీరుపై కూడా  విమర్శలు వస్తున్నాయి.  వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన ద్రావిడ్.. జట్టులో బ్యాటింగ్ లోపాలు ఉన్నాయని బహిరంగంగా చెప్పడం, షాట్ సెలక్షన్ సరిగా లేదని వ్యాఖ్యానించడం దుమారం రేపింది. 

26

ఇక మ్యాచ్ ఓడిన తర్వాత ద్రావిడ్.. గంగూలీతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా  విమర్శలకు దారితీశాయి. విదేశాలలో   ఆడుతున్నప్పుడు బ్యాటర్ల   సగటు తగ్గడం కొత్తేంకాదని, ఇతర జట్టు బ్యాటర్లకూ ఇదే జరుగుతుందని  చెప్పాడు. 

36

ఈ వ్యాఖ్యలపై తాజాగా గవాస్కర్ స్పందించాడు. ‘ఇతర దేశాల బ్యాటర్ల యావరేజ్ లు తగ్గుతున్నాయా..? లేదా..? అన్నది అనవసరం.  మనం టీమిండియా గురించి మాట్లాడుకుంటున్నాం. భారత బ్యాటర్ల యావరేజ్ విదేశాలలో దారుణంగా తగ్గుతోంది.  ఇది  జట్టు వైఫల్యాలకు దారి తీస్తోంది. విదేశాలలో బౌలర్లు అంతో ఇంతో రాణించినా   బ్యాటర్లు మాత్రం విఫలమవుతున్నారు. 

46

అందరూ విఫలమవుతున్నారని నేను చెప్పడం  లేదు. కానీ చాలా మంది ఇదే దారిలో ఉన్నారు.   మ్యాచ్ లు ఇండియాలో ఆడితే వాళ్లు బ్యాటింగ్ లో ఇరగదీస్తున్నారు.  కానీ విదేశాలలో ఆడితే మాత్రం ఎందుకు జీరోలు అవుతున్నారు..?   దీనిపై ఏదో ఒకటి చేయాలి. లేకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని దారుణ పరాజయాలు  ఎదుర్కోవాల్సి ఉంటుంది..’అని చెప్పాడు. 
 

56

ఇక విమర్శలకు ఎవరూ అతీతులు కారని  గవాస్కర్ అన్నాడు. తాము కూడా ఆడుతున్న రోజుల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కున్నామని, వాటిని స్వీకరించే గుణం ఉండాలని   సన్నీ అన్నాడు. టీమిండియా ఓటమితో ఇకనైనా డ్రెస్సింగ్ రూమ్, కోచింగ్ స్టాఫ్ లో మార్పు రావాలని  ఆకాంక్షించాడు.   

66

ప్రతీ విభాగంలోనూ విశ్లేషణ జరగాలని.. తాము ఎక్కడ విఫలమయ్యామోఅని  ప్రతీ ఒక్కరూ  ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించాడు.  అసలు  ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో భారత జట్టు విజయకాంక్షతో ఆడినట్టు తనకైతే అనిపించలేదని   సన్నీ ఆవేదన వ్యక్తం చేశడు. 

click me!

Recommended Stories