అశ్వినిని ఎందుకు పక్కనబెట్టారో నాకైతే అర్థం కాలేదు... డబ్ల్యూటీసీ ఓటమిపై సచిన్ టెండూల్కర్...

Published : Jun 12, 2023, 09:52 AM IST

ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నెం.1 ప్లేస్‌లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టి, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడింది టీమిండియా. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో నెం.2లో ఉన్న అశ్విన్ లేని లోటు టీమ్‌లో స్పష్టంగా కనిపించింది..

PREV
17
అశ్వినిని ఎందుకు పక్కనబెట్టారో నాకైతే అర్థం కాలేదు... డబ్ల్యూటీసీ ఓటమిపై సచిన్ టెండూల్కర్...
Sachin-Ashwin

ఇంగ్లాండ్‌లో పెద్ద ట్రాక్ రికార్డు లేని రవీంద్ర జడేజా 4 వికెట్లు తీస్తే, ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇదే ట్రాక్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఆడి ఉంటే అతనికి కనీసం 6-8 వికెట్లు అయినా పడి ఉండేవి...

27

అదీకాకుండా స్టీవ్ స్మిత్‌పై అశ్విన్‌కి అదిరిపోయే రికార్డు ఉంది. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్‌ ఫార్ములాని ఎంచుకున్న టీమిండియా, రవీంద్ర జడేజాని టీమ్‌లోకి తీసుకొచ్చి అశ్విన్‌ని పక్కనబెట్టడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణమంటున్నాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్..

37

‘డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచినందుకు ఆస్ట్రేలియాకి కంగ్రాట్స్. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ కలిసి తొలి ఇన్నింగ్స్‌లో నిర్మించిన భారీ భాగస్వామ్యం మ్యాచ్‌ని వారివైపు మళ్లించింది. టీమిండియాకి మళ్లీ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం దక్కినా సరిగ్గా వాడుకోలేకపోయింది..

47

నాకు ఇప్పటికీ అర్థం కానీ విషయం ఏంటంటే ప్రపంచంలో నెం.1 టెస్టు బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌‌ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఎందుకు తప్పించారు? స్కిల్ ఉన్న స్పిన్నర్లకు పిచ్‌తో పని లేదు, వాల్లు ఎక్కడైనా వికెట్లు తీయగలరు..

57

అదీకాకుండా ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో 8 మందిలో ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లే. అశ్విన్ ఉండి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండి ఉండేది...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్..
 

67
Ravichandran Ashwin

వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచిన ఆస్ట్రేలియాకి కంగ్రాట్స్. వాళ్లు ఈ విజయానికి పూర్తిగా అర్హులు. లెఫ్ట్ హ్యాండర్లపై అదిరిపోయే రికార్డు ఉన్న అశ్విన్‌ని పక్కనబెట్టినప్పుడే ఇండియా మతి పోయింది...

77
Ravichandran Ashwin

టాపార్డర్ బ్యాటర్లు కరెక్టుగా బ్యాటింగ్ చేయలేదు. అదీకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలవాలంటే కాస్త పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడాలి... అది మనోళ్ల దగ్గర లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

click me!

Recommended Stories