అవును, ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిచాడు! మేమంతా జోకర్లం... మాహీ అభిమానికి హర్భజన్ సింగ్ ఘాటు రిప్లై...

First Published Jun 12, 2023, 11:16 AM IST

ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఎప్పుడు విఫలమైనా మహేంద్ర సింగ్ ధోనీ పేరు బయటికి వస్తుంది. టీమిండియాకి మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ధోనీ ఉండి ఉంటే, ఇలా అయ్యేది కాదని తెగ గగ్గోలు పెడతారు మాహీ ఫ్యాన్స్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా ఓటమితో మరోసారి ధోనీ ఫ్యాన్స్, సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలెట్టాడు. మా వాడు తోపు, మా వోడు తురుము.. అంటూ ధోనీ ఫ్యాన్స్ రచ్చ చేస్తుండడంపై హర్భజన్ సింగ్ స్పందించాడు..

‘కోచ్ లేడు, మెంటర్ లేడు. టీమ్‌లో అందరూ కుర్రాళ్లే. సీనియర్లు కూడా వరల్డ్ కప్ ఆడడానికి ఇష్టపడలేదు. అంతకుముందు ఒక్క సింగిల్ మ్యాచ్ కూడా కెప్టెన్సీ చేయలేదు.

Latest Videos


సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాని ఓడించిన ఇతను, కెప్టెన్ అయ్యాక 48 రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్ గెలిచాడు...’ అంటూ టీ20 వరల్డ్ కప్ 2007 టీమిండియా కెప్టెన్ మాహీ ఫోటోను ట్వీట్ చేశాడు ఓ మాహీ వీరాభిమాని...

Dhoni-Harbhajan Singh

దీనికి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ‘అవును, ఇండియా తరుపున ఇతను ఒక్కడే అన్నీ మ్యాచులు గెలిచాడు. మిగిలిన 10 మంది ఆడలేదు. మేం జోకర్లం మాత్రమే...

అందుకే ఇతను ఒంటరిగా వరల్డ్ కప్ సాధించాడు. విచిత్రం ఏంటంటే ఆస్ట్రేలియా లేదా మరేదైనా దేశం వరల్డ్ కప్ గెలిస్తే, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది, ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచింది అని రాస్తారు..

Dhoni-Harbhajan Singh

కానీ మన దేశంలో ఇండియా గెలిస్తే, కెప్టెన్ ధోనీ గెలిచాడు, కెప్టెన్ రోహిత్ గెలిచాడు అని అంటారు. ఇది టీమ్ గేమ్. గెలిస్తే అందరం కలిసి గెలుస్తాం, ఓడితే అందరం కలిసి ఓడతాం...’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను ట్వీట్ చేశాడు హర్భజన్ సింగ్.. 

Dhoni-Gambhir

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఈ విధంగానే కామెంట్ చేశాడు. 1983 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన మోహిందర్ అమర్‌నాథ్‌కి గుర్తింపు రాలేదు కానీ కెప్టెన్ కపిల్ దేవ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని, అలాగే 2007, 2011 వరల్డ్ కప్ విజయాల్లో కీ రోల్ పోషించిన యువీకి దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదని వాపోయాడు గౌతీ.. 

click me!