ఇంకెన్నాళ్లు అతనే కావాలని అంటారు! ఇచ్చిన టీమ్‌తో గెలవండి, ఇంకేం చేయలేరు... - సునీల్ గవాస్కర్...

Published : Aug 22, 2023, 04:46 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి 17 మందితో కూడిన జట్టుని ప్రకటించింది బీసీసీఐ. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఈ టోర్నీ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. గాయంతో వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌కి దూరమైన సిరాజ్ కూడా ఆసియా కప్‌ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నాడు..

PREV
17
ఇంకెన్నాళ్లు అతనే కావాలని అంటారు! ఇచ్చిన టీమ్‌తో గెలవండి, ఇంకేం చేయలేరు... - సునీల్ గవాస్కర్...

కుల్దీప్ యాదవ్‌ని ప్రధాన స్పిన్నర్‌గా ఎంచుకున్న సెలక్టర్లు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను స్పిన్ ఆల్‌రౌండర్లుగా ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేశారు. అయితే యజ్వేంద్ర చాహాల్‌ని పట్టించుకోకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది..

27

మరికొందరు టీ20 వరల్డ్ కప్ 2021, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని వన్డే టీమ్‌లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై తన స్టైల్‌లో స్పందించాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..
 

37

‘అవును, కొంతమంది ప్లేయర్లు, వాళ్లు లక్కీ అని ఫీల్ అవ్వొచ్చు. అయితే టీమ్ సెలక్షన్ జరిగిపోయింది. కాబట్టి టీమ్‌కి ఎంపిక కాని వాళ్ల గురించి మాట్లాడడం అనవసరం. అశ్విన్ గురించి మాట్లాడి, అనవసర కాంట్రావర్సీలను క్రియేట్ చేయకండి..

47

ఇప్పుడు ఇది మన టీమ్. మీకు టీమ్ నచ్చకపోతే మ్యాచులు చూడడం మానేయండి. అంతేకానీ వాళ్లను తీసుకోలేదు, వీళ్లను తీసుకున్నారని చెత్త వాగుడు కట్టిపెట్టండి. ఇది కరెక్ట్ మైండ్ సెట్ కాదు..
 

57

ఈ టీమ్‌తో రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కూడా గెలవగలడు. మీకు ఇంకా ఎవరు కావాలి? యజ్వేంద్ర చాహాల్, రవి భిష్ణోయ్.. నాకైతే ఎవ్వరికీ అన్యాయం జరిగినట్టు అయితే కనిపించడం లేదు. అనుభవం ఉన్న, ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను ఆసియా కప్‌కి ఎంపిక చేశారు..

67
Asia Cup Indian Squad

వీరిలో మెజారిటీ ప్లేయర్లు కచ్ఛితంగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కూడా ఆడతారు. వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ గెలవడం చాలా ముఖ్యం. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లను వరల్డ్ కప్ ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ అనుకుంటోంది. కాబట్టి వాళ్లు గాయం నుంచి రికవరీ అయిన తర్వాత ఎలా ఆడతారనేది చాలా కీలకం..

77

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం ఉంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించి, మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా కావాల్సినన్ని మ్యాచులు దొరుకుతాయి. ఇకపై టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్ కీలకమే... వరల్డ్ కప్ టార్గెట్‌గా ఆడండి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

click me!

Recommended Stories