అందరికీ నచ్చేలా టీమ్‌ని సెలక్ట్ చేయడం అయ్యే పని కాదు. ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టు విషయంలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి, ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ వన్డే ఆడని తిలక్ వర్మను ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేయడం హాట్ టాపిక్ అయ్యింది..
కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కొన్ని నెలల తర్వాత టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంటే, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ రీఎంట్రీ టీమిండియాకి అదనపు బలాన్ని ఇవ్వనుంది...
28
బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్ పెంచడం కోసం హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో పాటు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ లాంటి మరో ఇద్దరు ఆల్‌రౌండర్లను కూడా ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
38
Rahul Dravid-Hardik Pandya
‘ఉన్నంతలో మంచి జట్టునే ఎంపిక చేశారు. అయితే ఓ మణికట్టు స్పిన్నర్ అవసరం అయితే కచ్ఛితంగా ఉంది. ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. లంకలో స్పిన్‌కి చక్కని సహకారం దొరుకుతుంది. కాబట్టి రవి భిష్ణోయ్ లేదా యజ్వేంద్ర చాహాల్‌ని ఎంపిక చేసి ఉంటే బాగుండేది..
48
మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు ఉన్నా ఓ మణికట్టు స్పిన్నర్, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను తుది జట్టులోకి తీసుకుంటే సరిపోయేది. ముగ్గురు, నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఆడించాల్సిన అవసరం లేదు..
58
Sanju and Chahal
నలుగురు ఫాస్ట్ బౌలర్లను తీసుకునే బదులు, ఒకరిని తప్పించి స్పిన్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వొచ్చు. మహ్మద్ షమీకి చాలా రోజులుగా బ్రేక్ ఇచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణ రీఎంట్రీ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఈ ఇద్దరిలో ఎవరి స్థానంలో అయినా స్పిన్నర్, టీమ్‌లోకి వస్తే బాగుంటుంది..
68
హార్ధిక్ పాండ్యాకి బ్యాకప్ ప్లేయర్‌గా ఎవరిని తీసుకున్నారు? శార్దూల్ ఠాకూర్ అయితే ఆ పనికి పనికి రాడు. అప్పుడప్పుడు మెరుపులు మెరిపించడం తప్ప, లోయర్ ఆర్డర్‌లో కచ్ఛితంగా పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు హార్ధిక్ స్థాయిలో రాణించడం శార్దూల్ వల్ల కాని పని...
78
శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో శివమ్ దూబేకి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అతను ఎలాగో మంచి ఫామ్‌లో ఉన్నారు. అవసరమైనప్పుడు వికెట్లు తీయడం, భారీ సిక్సర్లు కొట్టడం శివమ్ దూబేకి బాగా అలవాటైన పనే...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
88
ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి మెంటర్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్, 2024 సీజన్‌లో కేకేఆర్‌కి మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 2024 ఐపీఎల్ సీజన్‌కి గంభీర్ దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం..