‘ధోనీ వల్లే రోహిత్ శర్మ, 2011 వరల్డ్ కప్ ఆడలేకపోయాడు! కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వాలని అనుకున్నాం కానీ..’

First Published Aug 22, 2023, 1:59 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ టీమ్‌లో భారత ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి చోటు ఇవ్వకపోవడం, అతని స్థానంలో వన్డేల్లో ఇంకా ఆరంగ్రేటం చేయని తిలక్ వర్మకు చోటు దక్కడం చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. దీంతో 2011 వన్డే వరల్డ్ కప్ మిస్ అయిన రోహిత్ గురించి ప్రస్తావన వస్తోంది..
 

2007 టీ20 వరల్డ్ కప్‌లో ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత నాలుగేళ్లకు జరిగిన వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీలో చోటు దక్కించుకోలేకపోయాడు. దీనికి ప్రధాన కారణం కెరీర్ ఆరంభంలో నిలకడైన ప్రదర్శన చూపించడంలో విఫలం కావడమే..

2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కెరీర్ మలుపు తిరిగింది. ఐపీఎల్ పర్ఫామెన్స్‌తో రోహిత్‌ శర్మను ఓపెనర్‌గా మార్చడం, అతను టాపార్డర్‌లో సూపర్ సక్సెస్ అవ్వడం జరిగిపోయాయి...

Latest Videos


Dhoni-Rohit

అయితే 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ రోహిత్ శర్మను ఆడించాలని సెలక్టర్లు, అప్పటి టీమిండియా హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అనుకున్నారట. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లే రోహిత్, వరల్డ్ కప్ ఆడలేకపోయాడని అంటున్నాడు మాజీ సెలక్టర్ రాజా వెంకట్..

‘2011 వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్ సెలక్షన్ గురించి కొన్ని గంటల పాటు మీటింగ్ జరిగింది. రోహిత్ శర్మను వరల్డ్ కప్ ఆడించాలని మేం (సెలక్షన్ కమిటీ) అనుకున్నాం. కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా అతని ఎంపికపై ఉత్సాహం చూపించాడు..

అయితే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మాత్రం రోహిత్ శర్మను ఆడించడం కంటే పియూష్ చావ్లాని ఆడించడమే బెటర్ అని ఫీల్ అయ్యాడు. రోహిత్ అయితే ఆల్‌రౌండర్‌గా పనికి వస్తాడని మేం నచ్చచెప్పినా పట్టించుకోలేదు. ఇక తప్పక రోహిత్‌ని తప్పించాల్సి వచ్చింది..

Rohit-Dhoni

ఆ టోర్నీలో టీమిండియా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే రోహిత్ శర్మను ఎంపిక చేయనందుకు చాలా పెద్ద రచ్చ జరిగి ఉండేది. ఎందుకంటే అతను అప్పటికే టీ20 వరల్డ్ కప్ 2007 గెలిచిన జట్టులో ఉన్నాడు, అలాగే ఐపీఎల్‌లో హ్యాట్రిక్ కూడా తీశాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ సెలక్టర్ రాజా వెంకట్..

అంతేకాకుండా ధోనీ, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ కారణంగా టీమ్‌లో తలెత్తిన విభేదాలను కూడా రాజా వెంకట్ బయటపెట్టాడు. ‘2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఓడిపోయింది. దీంతో ప్రపంచ కప్ గెలిచిన 6 నెలలకే ధోనీని, కెప్టెన్సీ నుంచి తప్పించాలని అప్పటి బీసీసీఐ సెలక్టర్లు భావించారు..

rohit dhoni kohli

ధోనీ ప్లేస్‌లో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించాలని అనుకున్నారు. అయితే బీసీసీఐ బోర్డులో చాలా మంది ధోనీకి సపోర్టుగా నిలవడంతో అది వీలు కాలేదు. ముఖ్యంగా బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్, ధోనీనే కెప్టెన్‌గా కొనసాగించాలని పట్టుబట్టాడు...

వరుస వైఫల్యాలతో ధోనీ టెస్టుల నుంచి తప్పుకున్నాక విరాట్ కోహ్లీకి టెస్టు కెప్టెన్సీ అప్పగించారు. అయితే అప్పటికే టీమ్‌లో గ్రూపిజం మొదలైంది. ఓ వర్గం ధోనీని తప్ప మరో ప్లేయర్‌ని కెప్టెన్‌గా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. 

Kohli and Dhoni

అప్పటికే కోహ్లీ, నార్త్ జోన్‌కి దేవ్‌ధర్ ట్రోఫీ అందించాడు. అలాగే కెప్టెన్‌గా అండర్19 వరల్డ్ కప్ గెలిచాడు. అందుకే అతనికి కెప్టెన్సీ ఇవ్వడమే సరైన నిర్ణయమని భావించి, ముందుకెళ్లాం.. అతను టెస్టుల్లో సాధించిన సక్సెస్, అది సరైన నిర్ణయమనే సంతృప్తిని మిగిల్చింది’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ సెలక్టర్ రాజా వెంకట్.. 

click me!