భరత్, ఇషాన్ వద్దు.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు వికెట్ కీపర్‌గా అతడే ముద్దంటున్న గవాస్కర్.. కుదిరే పనేనా..?

Published : Mar 14, 2023, 09:58 PM IST

INDvsAUS: ఐసీసీ  ఈ ఏడాది  నిర్వహించబోయే  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ లో భారత్ - ఆస్ట్రేలియాలు తలపడబోతున్నాయి.   జూన్ లో  ఫైనల్ జరుగనుంది. 

PREV
16
భరత్, ఇషాన్ వద్దు.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు వికెట్ కీపర్‌గా అతడే ముద్దంటున్న గవాస్కర్.. కుదిరే పనేనా..?

పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ  నెగ్గడానికి  భారత జట్టుకు ఈ ఏడాది  రెండు అవకాశాలున్నాయి. అందులో ఒకటి వన్డే వరల్డ్ కప్ కాగా రెండోది వరల్డ్  టెస్ట్ ఛాంపియన్షిప్.  వన్డే వరల్డ్ కప్ కు ఇంకా చాలా సమయం ఉన్నందున  ప్రస్తుతానికి భారత్ కన్నేసిన  ట్రోఫీ  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్.  

26

బోర్దర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) లో భాగంగా మూడో టెస్టు గెలిచాక  ఆసీస్  ఫైనల్స్ కు అర్హత సాధించగా  నాలుగో టెస్టును డ్రా చేసుకోవడంతో పాటు  న్యూజిలాండ్.. శ్రీలంకను ఓడించడంతో భారత్ కూడా ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరడం భారత్ కు ఇది వరుసగా రెండోసారి. తొలి ప్రయత్నంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నది.  
 

36

అయితే  టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్  కు గాయం కారణంగా  తప్పుకోవడంతో జూన్ లో జరుగబోయే ఈ టోర్నీకి  వికెట్ కీపర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది.  బీజీటీలో పంత్ స్థానంలో వచ్చిన కెఎస్ భరత్,   ఇషాన్ కిషన్ లలో ఎవరికి ఆడించాలనేదానిపై ఇప్పటికే క్రికెట్ పండితులు, సీనియర్ క్రికెటర్లు   చర్చోపచర్చలు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై  టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు.  

46

స్పోర్ట్స్ తక్ తో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘కెఎల్ రాహుల్ బ్యాటర్ తో పాటు వికెట్ కీపర్ కూడా.   అతడు ఓవల్ (డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరిగేది అక్కడే)  లో ఐదు లేదా ఆరోస్థానంలో బ్యాటింగ్ కు వస్తే అప్పుడు భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతోంది.  

56

ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్ ల మీద రాహుల్  2021 పర్యటనలో భాగా ఆడాడు. ఆ సిరీస్ లో   నాలుగు మ్యాచ్ లలో  315 రన్స్ చేశాడు. లార్డ్స్ లో సెంచరీ చేశాడు.  డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఇండియా .. కెఎల్ రాహుల్ ను మరిచిపోవద్దు...’అని  అన్నాడు.  అయితే  రాహుల్ అప్పటిదాకా టీమ్ లో ఉంటాడా..? లేదా..? అన్నది అనుమానమే.   

66

రోహిత్ తర్వాత భావి భారత సారథిగా అనుకున్న అతడు..  క్రమంగా ఫామ్ కోల్పోతూ పేలమైన ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. వన్డే, టెస్టు జట్టులో వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు. టీ20లలో అయితే సెలక్టర్లు అతడిని పట్టించుకోవడమే మానేశారు.   ఇక ప్రస్తుత ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే  మాత్రం రాహుల్ కు  భారత జట్టులో చోటు దక్కడం  కష్టమే. అదీగాక కొత్త కుర్రాడు శుభ్‌మన్ గిల్ బీభత్సమైన ఫామ్ లో ఉండగా  రాహుల్ టీమ్ లో ప్లేస్ కోసం ఆశించడం అత్యాశే.. 

click me!

Recommended Stories