35 ఏళ్ల లేటు వయసులో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియాకి కెప్టెన్సీ చేయాలనుకున్నాడు. అయితే బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా రోహిత్‌పై టెస్టు కెప్టెన్సీ భారం కూడా పడింది...
2022 జనవరిలో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, 14 నెలల కాలంలో ఆరు టెస్టులకు కెప్టెన్సీ చేస్తే.. విదేశాల్లో జరిగిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. కరోనా కారణంగా ఇంగ్లాండ్ టూర్‌లో జరిగిన ఐదో టెస్టు ఆడని రోహిత్ శర్మ, గాయంతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు...
27
విదేశాల్లో దారుణమైన టెస్టు రికార్డు ఉన్న రోహిత్ శర్మ, 2021 ఇంగ్లాండ్ పర్యటనలో మొట్టమొదటి ఫారిన్ టెస్టు సెంచరీ అందుకున్నాడు. జూన్‌లో ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, కెప్టెన్‌గా రోహిత్ శర్మకు తొలి ఫారిన్ టెస్టు కానుంది...
37
‘నేను ప్రతీ మ్యాచ్ నుంచి కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నా. టీ20 క్రికెట్‌లో నేను ఎన్నో మ్యాచులకు కెప్టెన్సీ చేశా. మిగిలిన ఫార్మాట్‌తో పోలిస్తే, టెస్టుల్లో నాకున్న అనుభవం కూడా తక్కువ. టెస్టు కెప్టెన్‌గా నేను ఆడింది ఆరంటే ఆరు మ్యాచులే...
47
Image credit: PTI
నా చుట్టూ ఉన్న ప్లేయర్ల నుంచి టెస్టు కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నా. ప్రతీ చిన్న విషయంలో సాయం చేయడానికి వాళ్లు అండగా ఉంటున్నారు. నేను ఎప్పుడు కెప్టెన్సీ చేసినా ఏ పనైనా సింపుల్‌గా అయిపోయేలా చూసుకుంటా. పిచ్చిగా ఏ పని చేయకుండా జాగ్రత్త పడతా...
57
Virat Kohli-Rohit Sharma
టెస్టు ఫార్మాట్‌లో ఓపిక చాలా అవసరం. ఫీల్డ్‌లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి. నేను ఎప్పుడూ ఇదే ఆలోచిస్తా... టెస్టు కెప్టెన్సీని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా.. కొన్నిసార్లు కొన్ని ఛాలెంజ్‌లు ఫేస్ చేయాల్సి వస్తుంది. కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గానూ ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నా...
67
Rohit sharma slaps Ishan Kishan
తప్పులు అందరూ చేస్తారు, నేను కూడా చేశా.. అయితే చేసిన తప్పులు చేయకుండా ముందుకు వెళ్లినప్పుడే సక్సెస్ వస్తుంది. టీమ్‌ని ముందుకు వెళ్లడానికి ఏం చేస్తే బాగుంటుందా? అనే కోణంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నా, తెలుసుకుంటున్నా...
77
విరాట్ కోహ్లీ 100కి పైగా టెస్టులు ఆడాడు. ఎన్నో సెంచరీలు చేశాడు. అలాంటి ప్లేయర్, అప్పుడప్పుడు కొన్ని ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ అవడం సహజం. ఆసియా కప్‌లో, టీ20 వరల్డ్ కప్‌లో అతను ఎలా ఆడాడో చూశాం. అతను టీమ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అదే అతని సక్సెస్ సీక్రెట్...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..