టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఎలా ఉందో తెలీదు కానీ, భారత క్రికెట్ జట్టులో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం పెను దుమారానికి కారణమైంది...
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఐసీసీ టైటిల్స్ గెలవలేదనే సాకుతో అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
211
అయితే ఐసీసీ టైటిల్స్ గెలవడానికి విరాట్ కోహ్లీకి వచ్చిన అవకాశాలు తక్కువ కావడం, ఐసీసీ టోర్నీల్లో సారథిగా కోహ్లీ పర్ఫామెన్స్ మిగిలిన కెప్టెన్ల కంటే మెరుగ్గా ఉండడంతో ఆయన ఫ్యాన్స్, బీసీసీఐ ధోరణిని తీవ్రంగా విమర్శిస్తున్నారు...
311
అన్నింటికీ మించి వన్డేల్లో అత్యధిక విజయాల శాతం ఉన్న విరాట్ కోహ్లీని పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయ్యింది...
411
తాజాగా మాజీ కెప్టెన్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ విషయం మీద స్పందించారు... ‘కొన్నిసార్లు మనం చేసే ప్రకటనలు, అధికారంలో ఉన్నవారి అహాన్ని దెబ్బ తీయొచ్చు. విరాట్ విషయంలో కూడా అదే జరిగిందని అనుకుంటున్నా...
511
టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటూ విరాట్ కోహ్లీ ప్రకటించినప్పుడు, వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగుతా? అని కామెంట్ చేశాడు. అది బీసీసీఐ పెద్దల గర్వాన్ని దెబ్బతీసినట్టుంది...
611
నేను వన్డే, టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాను... అని విరాట్ కోహ్లీ చెప్పాల్సింది. కొనసాగుతాను... అని చెప్పడం వల్ల, బీసీసీఐ, అతని మాటలను మరో రకంగా అర్థం చేసుకుని ఉండొచ్చు...
711
కొనసాగుతానని విరాట్ కోహ్లీ ప్రకటిస్తే, బోర్డు ఇష్టపడినా, లేకపోయినా తాను కెప్టెన్‌ని అని చెప్పినట్టు భావించి ఉండొచ్చు. అందుకే అతన్ని వన్డే కెప్టెన్‌గా తప్పించాలని బీసీసీఐ భావించి ఉండొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
811
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో బీభత్సమైన మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి...
911
ముఖ్యంగా విరాట్ ఫ్యాన్స్, గవాస్కర్ కామెంట్లను బట్టి చూస్తుంటే కేవలం అధికారాన్ని చూపించుకోవడం కోసమే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినట్టుగా తెలుస్తోందని బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు...
1011
‘సార్... నాకు లీవ్ కావాలి’... అని అడగడానికి, ‘సార్... నేను లీవ్ తీసుకుంటున్నా’ అని చెప్పడానికి మధ్య ఉన్న చిన్న తేడాను విరాట్ కోహ్లీ గుర్తించలేకపోయాడని కార్పొరేట్ ఉద్యోగులు పోస్టులు చేస్తున్నారు...
1111
మొత్తానికి విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనక ఓ కార్పొరేట్ రాజకీయమే జరిగిందని అభిప్రాయానికి వచ్చేశారు క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు...