రోహిత్ శర్మకు సపోర్ట్‌గా ఆ ముగ్గురూ... ఒంటరైన విరాట్ కోహ్లీ... అసలు విలన్ అతనేనా...

Published : Dec 16, 2021, 09:25 AM IST

భారత క్రికెట్ బోర్డులో రాజకీయ రంగులు బయటపడుతున్నాయి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం, భారత జట్టులో పరిస్థితులు ఇంతకుముందులా లేవని సగటు క్రీడాభిమానికి అర్థమయ్యేలా చేశాయి...

PREV
114
రోహిత్ శర్మకు సపోర్ట్‌గా ఆ ముగ్గురూ... ఒంటరైన విరాట్ కోహ్లీ... అసలు విలన్ అతనేనా...

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటన చేయడం, ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో తొలి రెండు మ్యాచుల్లో భారత జట్టు చెత్త ప్రదర్శన ఇవ్వడం... హాట్ టాపిక్ అయ్యాయి...

214

టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా, గ్రూప్ స్టేజ్‌కే పరిమితమై ఇంటికి చేరగా ఆ తర్వాత న్యూజిలాండ్‌ సిరీస్ సజావుగా సాగినా... సౌతాఫ్రికా సిరీస్‌కి ముందు వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా రోహిత్‌ను ప్రకటించడంతో చిచ్చు రేగింది...

314

ఆ తర్వాత వన్డే సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడనే వార్త రావడంతో ఒక్కసారిగా రోహిత్, విరాట్ మధ్య వైరం తారాస్థాయికి చేరిందనే పుకార్లు షికార్లు చేశాయి...

414

అయితే ఎట్టకేలకు విరాట్ కోహ్లీ స్వయంగా మీడియా ముందుకు వచ్చి, ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, బీసీసీఐలో రాజకీయాలు మొదలయ్యాయని తెలుస్తోంది...

514

ఐపీఎల్ టైటిల్‌తో పాటు ఐసీసీ టైటిల్స్ కూడా గెలవలేకపోయాడనే ఉద్దేశంతో విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

614

ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియాకి ఐసీసీ టైటిల్ గెలిపించగలడని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ అండ్ కో గట్టిగా నమ్ముతున్నట్టు అర్థమవుతోంది...

714

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టుగా విరాట్ కోహ్లీకి గంటన్నర ముందు లాంఛనప్రాయంగా తెలియచేయడంతో పాటు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని విరాట్‌ను స్వయంగా కోరినట్టు గంగూలీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే... టీమిండియా కెప్టెన్‌పై జనాల్లో నెగిటివిటీ పెంచాలనే ప్రయత్నం కనిపిస్తోందంటున్నారు అభిమానులు...

814

టీమిండియా హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నన్ని రోజులు భారత జట్టులో విరాట్ కోహ్లీ ఆధిపత్యం నడిచింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టుతోనే మూడు ఫార్మాట్లలోనూ అద్భుత విజయాలు అందుకోగలిగాడు విరాట్...

914

టీమిండియా రిజర్వు బెంచ్ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా తయారయ్యిందంటే దానికి కారణం విరాట్ కోహ్లీ కెప్టెన్సీయే. అందులో ఎలాంటి సందేహం లేదు...

1014

అయితే ఐసీసీ టైటిల్ గెలవడంలో విఫలమైన విరాట్‌ కోహ్లీని కెప్టెన్సీ నుంచి సైడ్ చేసేందుకు బీసీసీఐ రాజకీయ ఎత్తుగడలు వేసిందని, అందుకే రవిశాస్త్రిని తప్పించి, రాహుల్ ద్రావిడ్‌ని హెడ్‌కోచ్‌గా తెచ్చారని భావిస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్...

1114

రాహుల్ ద్రావిడ్‌తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా కూడా రోహిత్ శర్మకు సపోర్టుగా ఉన్నట్టు విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూస్తే తెలుస్తోంది...

1214

భారత మహిళా జట్టులో టీ20 ఫార్మాట్‌కి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, వన్డేలకు, టెస్టులకు మిథాలీరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది...

1314

అలా చూసుకుంటే వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండడం టీమిండియాకి కొత్తేమీ కాదు. అయినా విరాట్‌ని తప్పించి, రోహిత్‌ని వన్డే కెప్టెన్‌గా నియమించడం వెనకాల బీసీసీఐ పెద్దలు ఉన్నారని అనుమానిస్తున్నారు అభిమానులు....

1414

ఇన్ని రోజులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య వైరం వల్లే టీమిండియాలో లుకలుకలు వచ్చాయని భావించిన అభిమానులకు... ఇప్పుడు బీసీసీఐ బాస్‌లు సౌరవ్ గంగూలీ, జై షాలు మెయిన్ విలన్లుగా కనిపిస్తున్నారని మీమ్స్ వైరల్ అవుతున్నాయి...

Read more Photos on
click me!

Recommended Stories