రోహిత్ లెక్కేసి కొట్టాడు... కెప్టెన్ ఇన్నింగ్స్‌కి కారణం ఇదేనంటున్న సునీల్ గవాస్కర్...

First Published Sep 24, 2022, 12:20 PM IST

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ద్వైపాక్షిక సిరీసుల్లో విజయాలు సాధిస్తూ వచ్చింది భారత జట్టు. అయితే ఆసియా కప్ 2022 నుంచి సీన్ మారింది. వరుసగా మూడు టీ20ల్లో ఓడిన రోహిత్ సేన, నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. టాపార్డర్ ఫెయిల్ అయినా రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టీమిండియాకి విజయాన్ని అందించాడు..

Image credit: PTI

వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 ఓవర్లలో 90 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా ఫెయిల్ అయనా రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టీమిండియాని ఆదుకున్నాడు..

Image credit: Getty

20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు. గత మూడు మ్యాచుల్లో రోహిత్ శర్మకు ఇది రెండో హాఫ్ సెంచరీ. ఆసియా కప్ 2022 టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు రోహిత్ శర్మ...

Rohit Sharma

‘రోహిత్ శర్మ ఆరోజు ఓ లెక్క మీద ఆడాడు. అతను టీమిండియాని కాపాడాలని, తన వికెట్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆడలేదు. చాలా సెలక్టివ్‌గా షాట్స్‌ ఎంచుకుని మరీ ఆడాడు...

Image credit: PTI

రోహిత్ శర్మ చూడచక్కని షాట్స్ ఆడతాడు. తన రేంజ్ ఏంటో తెలుసుకుని ఆడితే ఎలాంటి సమస్య ఉండదు. బంతి వచ్చేదాకి వెయిట్ చేశాడు. బాల్ కట్ చేసిన విధానం, ఫుల్లింగ్ చేసిన విధానం మరో లెవెల్. ప్రతీ బంతిని కొట్టాలనే ఉద్దేశంతో క్రీజుకి రాలేదు... రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌కి ఇదే కారణం...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

టీ20ల్లో భారత కెప్టెన్‌గా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలవడం రోహిత్ శర్మకి ఇది ఐదోసారి. ఇంతకుముందు విరాట్ కోహ్లీ 3 సార్లు ఈ ఫీట్ సాధించాడు. సురేష్ రైనా ఓ సారి టీ20ల్లో కెప్టెన్‌గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలవగా ఎమ్మెస్ ధోనీ ఒక్కసారి కూడా పొట్టి ఫార్మాట్‌లో ఈ ఫీట్ సాధించలేదు. 

click me!