ఈ మ్యాచ్ లో తొలుత తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మాథ్యూవేడ్ (43 నాటౌట్), కెప్టెన్ ఫించ్ (31) లు ధాటిగా ఆడారు.లక్ష్య ఛేదనలో ఇండియా.. 7.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో భారత్‌కు విజయం దక్కింది.