రవీంద్ర జడేజాని వదిలేది లేదంటున్న సీఎస్‌కే... బెంచ్‌లో అయినా కూర్చోబెడతాం కానీ బయటికి పోనివ్వం...

First Published Sep 24, 2022, 11:15 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది. 14 మ్యాచుల్లో 4 మాత్రమే గెలిచి 10 మ్యాచుల్లో చిత్తుగా ఓడింది. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఆఖరి పొజిషన్‌లో నిలవడంతో సీఎస్‌కే ఫెయిల్యూర్‌ని పెద్దగా పట్టించుకోలేదు అభిమానులు. 

jadeja

ఐపీఎల్ 2022లో రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మధ్య సంబంధాలు మాత్రం పూర్తిగా చెడిపోయాయి. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ...

Ravindra Jadeja

ఎప్పటి నుంచో సీఎస్‌కే తర్వాతి కెప్టెన్ నేనే.. అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన రవీంద్ర జడేజా, మాహీ ప్లేస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే జడ్డూ అనుకున్నంత సజావుగా అతని కెప్టెన్సీ కెరీర్ మొదలవ్వలేదు...

Ravindra Jadeja

ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా వరుసగా మొదటి నాలుగు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది చెన్నై సూపర్ కింగ్స్.  ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు దక్కాయి. అయితే కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోయిన రవీంద్ర జడేజా.. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆఖరికి చేతుల్లోకి వచ్చిన క్యాచులను కూడా అందుకోలేకపోయాడు...

దీంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ మళ్లీ ఎమ్మెస్ ధోనీకే కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ నిర్ణయం తర్వాత సీఎస్‌కే, రవీంద్ర జడేజాని అన్‌ఫాలో అయ్యింది. జడ్డూ కూడా సీఎస్‌కేకి సంబంధించిన పోస్టులు, కామెంట్లు అన్నీ డిలీట్ చేసేశాడు...

Ravindra Jadeja

ఆ తర్వాత రెండో మ్యాచ్‌కే గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు రవీంద్ర జడేజా. జడ్డూ గాయంపై తీవ్ర అనుమానాలు రేగాయి. జడేజాకి నిజంగా గాయమైందా? లేక ఆ వంకతో సీజన్ నుంచి తప్పుకున్నాడా? అనే అనుమానాలు వినిపించాయి..

జడ్డూతో చెన్నై సూపర్ కింగ్స్ తెగతెంపులు చేసుకుందని, అతను ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్త ఫ్రాంఛైజీకి ఆడడం ఖాయమని అనుకున్నారంతా. అయితే సీఎస్‌కే ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయి. జడ్డూతో సీఎస్‌కే సంబంధాలు తెగి పోవడంతో అతన్ని ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయాలని భావించాయట మిగిలిన జట్లు...

సీఎస్‌కేతో జడ్డూని ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లు ప్రయత్నించాయట. అయితే సీఎస్‌కే మాత్రం జడేజాని బయటికి పంపించడానికి సిద్ధంగా లేదని సమాచారం..

వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా ఆడేందుకు రవీంద్ర జడేజా ఇష్టపడకపోతే అతన్ని రిజర్వు బెంచ్‌లో అయినా కూర్చోబెడతాం కానీ వేరే జట్లలోకి పోనిచ్చేది లేదని ఆ ఫ్రాంఛైజీ స్పష్టం చేసినట్టు సమాచారం... 

ఒంటి చేత్తో మ్యాచ్‌ని మలుపు తిప్పగల సత్తా ఉన్న రవీంద్ర జడేజాని బయటికి పంపిస్తే తమ జట్టుకి మంచిది కాదని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుందట.  

click me!