అతని టైం అయిపోయింది, కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమే... ముందు బేసిక్స్ నేర్చుకోవాలి...

Published : Feb 01, 2022, 12:08 PM IST

జస్ప్రిత్ బుమ్రా స్టార్ బౌలర్‌గా ఎదగకముందే భారత జట్టుకి ప్రధాన పేసర్‌గా ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. భువీ, బుమ్రా కలిసి అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియాకి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అయితే భువీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది...

PREV
19
అతని టైం అయిపోయింది, కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమే... ముందు బేసిక్స్ నేర్చుకోవాలి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భువీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడిన భువనేశ్వర్ కుమార్, ఒక్క వికెట్ తీయలేకపోగా... భారీగా పరుగులు సమర్పించాడు... 

29

ఈ పర్ఫామెన్స్ కారణంగా వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కి భువనేశ్వర్ కుమార్‌ని పక్కనబెట్టిన సెలక్టర్లు, టీ20 సిరీస్‌లో మాత్రం చోటు దక్కించుకోగలిగాడు...

39

అయితే భువనేశ్వర్ కుమార్‌ టైం అయిపోయిందని, అతని బౌలింగ్‌లో మునుపటి మెరుపులు ఏ మాత్రం కనిపించడం లేదని అంటున్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

49

‘ఇప్పుడు దీపక్ చాహార్‌కి అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చినట్టుంది. భువీతో పోలిస్తే దీపక్ చాహార్ చిన్నోడు. అంతేకాకుండా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు...

59

అంతేకాకుండా లోయర్ ఆర్డర్‌తో బ్యాటుతో పరుగులు కూడా చేయగలడు. భువనేశ్వర్ కుమార్ టీమిండియాకి ఎంతో సేవ చేశాడు. అతని సేవలను తక్కువ చేయడానికి లేదు...

69

అయితే అతను రెండు సీజన్లుగా ఫ్రాంఛైజీ క్రికెట్ కూడా సరిగా ఆడడం లేదు, అదీకాకుండా భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు. ఇంతకుముందు భువీ అద్భుతమైన యార్కర్లు, స్లో బంతులతో వికెట్లు తీసేవాడు...

79

ఇప్పుడు ఆ ట్రిక్ ఏ మాత్రం వర్కవుట్ కావడం లేదు. భువనేశ్వర్ ఇంతకుముందులా యార్కర్లు వేయలేకపోతున్నాడు. అంతేకాకుండా అతని బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బాగా అలవాటు చేసుకున్నారు...

89

ఇప్పుడు భువీ బౌలింగ్ చూస్తుంటే అతనికి ఫ్యూచర్ ఉన్నట్టు కనిపించడం లేదు. అతని బౌలింగ్‌లో పేస్ లేదు, యార్కర్లు వేయడం లేదు... సరైన ఫిట్‌నెస్ ఉన్నట్టు కూడా కనిపించడం లేదు...

99

ఇప్పుడు అతను టీమిండియాలో స్థిరమైన చోటు దక్కించుకోవాలంటే బేసిక్స్ మీద ఫోకస్ పెట్టాలి. మరింత రాటుతేలేందుకు కష్టపడాలి... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

click me!

Recommended Stories