క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి భారత క్రికెట్ బోర్డుపై, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు హర్భజన్ సింగ్. తాజాగా బీసీసీఐలో తెలిసిన వాళ్లు ఉన్నవాళ్లకే టీమిండియా కెప్టెన్సీ దక్కుతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు హర్భజన్ సింగ్...
టీమిండియా తరుపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచులు ఆడిన సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, దాదాపు ఐదేళ్ల పాటు భారత తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
211
2011 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి, టైటిల్ సాధించింది ముంబై ఇండియన్స్... ముంబైకి దక్కిన తొలి టైటిల్ ఇదే...
311
తనలో కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని నిరూపించుకున్నప్పటికీ భారత జట్టుకి సారథిగా వ్యవహరించే అవకాశం మాత్రం హర్భజన్ సింగ్‌కి ఎప్పుడూ దక్కలేదు...
411
‘అవును, నాకు టీమిండియాకి కెప్టెన్సీ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే నాకు బీసీసీఐలో ఎవ్వరూ తెలీదు. కెప్టెన్సీ రావాలంటే నా పేరును ఎవరో ఒకరు సిఫారసు చేయాలి...
511
నాకు కెప్టెన్సీ ఇవ్వాలని బోర్డు పెద్దలతో వాదించాలి. నాకు అలా ఎవ్వరూ తెలీదు. అంతేకాకుండా బోర్డులో ఉన్నవారిని నేను స్పెషల్ పర్సన్‌ని కూడా కాదు కదా...
611
అయితే టీమిండియాకి ఎందుకు కెప్టెన్సీ చేయలేదనే విషయాన్ని పక్కనబెడితే, నాలో కెప్టెన్సీ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయి. చాలామంది కెప్టెన్లకు సలహాలు, సూచనలు కూడా ఇచ్చాను...
711
నేను టీమిండియా కెప్టెన్ కానుందుకు బాధపడడం లేదు. ఎందుకంటే భారత జట్టుకు ప్లేయర్‌గా సేవ చేసే అవకాశం దక్కడమే గర్వంగా భావిస్తున్నా... ’ అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్...
811
‘రికీ పాంటింగ్, మాథ్యూ హేడన్ లాంటి ప్లేయర్లు కూడా నా ఆట గురించి గొప్పగా చెబుతారు, నన్ను గౌరవిస్తూ మాట్లాడతారు. వారి మాటలు వింటుంటే గర్వంగా ఉంటుంది...
911
ఏమీ చేయనప్పుడు అలాంటి ప్లేయర్లు, నన్ను పొగడరు కదా... ఓ ప్లేయర్‌గా నేను ఎంతో కొంత సాధించాను. మా తరంలో క్రికెట్‌లో ఆస్ట్రేలియానే బాస్. వారిని ఎదుర్కోవడం ఏ జట్టుకైనా ఛాలెంజింగ్‌గానే ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...
1011
ఐపీఎల్ 2011 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా చేసిన సచిన్ టెండూల్కర్ ఫిట్‌గా లేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫికి సారథిగా వ్యవహరించాడు హర్భజన్ సింగ్...
1111
ఆ తర్వాతి సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించన హర్భజన్ సింగ్, జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చగలిగాడు. అయితే 2013లో రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అందించాడు భజ్జీ...