అతన్ని ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు?... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్ కామెంట్స్...

First Published | Aug 29, 2021, 4:16 PM IST

అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాపై విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్. మూడో టెస్టులో భారత జట్టు పరాభవంతో ఫుల్లు ఖుషీగా ఉన్న మైకెల్ వాగన్, తాజాగా జట్టులో అజింకా రహానే ప్లేస్‌పై కొన్ని కామెంట్లు చేశాడు...

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్న అజింకా రహానే, మిగిలిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 34 పరుగులు మాత్రమే చేశాడు...

అజింకా రహానే వరుసగా విఫలం అవుతుండడంతో అతను తర్వాతి టెస్టులో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్, విశ్లేషకులు...


‘భారత జట్టుకి అజింకా రహానే ఓ సమస్యగా తయారయ్యాడు. ఇంగ్లాండ్ జట్టులో మూడో టెస్టుకి ముందు అవసరమైన మార్పులు జరిగాయి...

సరిగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదని జాక్ క్రావ్లీ, డొమినిక్ సిబ్లీలను జట్టులో నుంచి తప్పించారు. అయితే టీమిండియా మాత్రం ఇప్పటిదాకా అలాంటి మార్పులు చేయడం లేదు...

అయితే నాలుగో టెస్టులో మాత్రం టీమిండియాలో మార్పులు అనివార్యం... ఓవల్ టెస్టులో ఒకరు లేదా ఇద్దరు కొత్త ప్లేయర్లను ఆడించాల్సి ఉంటుంది...

అజింకా రహానే కేవలం వైస్ కెప్టెన్ అవ్వడం వల్లే అతన్నితొలగించకుండా ఆడిస్తున్నట్టుగా ఉంది. లేదా గత కొన్నేళ్లలో అతను ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ల కారణంగా రహానేకి అవకాశాలు ఇస్తున్నారా?

ఎలా చూసినా వరుసగా విఫలం అవుతున్న ప్లేయర్‌కి వరుసగా అవకాశాలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదు, విజయాలు రావాలంటే ఫామ్‌లో ఉన్న ప్లేయర్లకు అవకాశం ఇచ్చి ఆడించాల్సి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు మైకెల్ వాగన్...

అజింకా రహానేతో పోల్చి చూస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పెద్దగా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది కూడా ఏమీ లేదు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రహానే కంటే 20 పరుగులు మాత్రమే ఎక్కువ చేశాడు కోహ్లీ...

వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న పూజారా, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ పర్ఫామెన్స్‌తో నాలుగో టెస్టులో అతని ప్లేస్ కన్ఫార్మ్ అయినట్టే. మరి రహానేకి ఇంకో ఛాన్స్ దక్కుతుందా? లేదా? అనేది చూడాలి.

Latest Videos

click me!