ప్రయోగాలు ముఖ్యమే.. కానీ ఈ టోర్నీలో కూడానా..? టీమిండియా మేనేజ్మెంట్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం

Published : Sep 08, 2022, 01:38 PM IST

Asia Cup 2022: ఆసియా కప్ గెలవడమే లక్ష్యంగా దుబాయ్ లో అడుగుపెట్టిన టీమిండియా.. అది అందుకోకుండానే  ఇంటిబాట పట్టింది. సూపర్-4లో వరుసగా రెండు మ్యాచులు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

PREV
17
ప్రయోగాలు ముఖ్యమే.. కానీ ఈ టోర్నీలో కూడానా..? టీమిండియా మేనేజ్మెంట్‌పై  మాజీ క్రికెటర్ ఆగ్రహం

ఆసియా కప్-2022లో భారత జట్టు కథ ముగిసింది. సోమవారం  శ్రీలంకతో మ్యాచ్ లో ఓడిన భారత జట్టు ఫైనల్ బెర్త్ నుంచి నిష్క్రమించింది. అయితే ఏ మూలనో ఉన్న ఆశలతో అఫ్గాన్.. పాక్ ను ఓడిస్తుందని ఆశించినా  అలా జరగలేదు.  దీంతో టీమిండియా ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.  

27

అయితే ఈ టోర్నీలో భారత జట్టు ప్రధాన వైఫల్యంగా చెప్పుకుంటున్న  తుది జట్టు ఎంపికపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. ఇదే విషయమై మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు  టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

37

ఆసియా కప్ లో భారత్ నాలుగు మ్యాచులాడగా.. ఆ నాలుగింటిలోనూ  మార్పులు చేయకుండా దిగిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. తొలి మ్యాచ్ లో పంత్ ను కాదని దినేశ్ కార్తీక్ ను.. రెండో మ్యాచ్ లో అతడిని పక్కనబెట్టి పంత్, హుడా ను తీసుకున్నారు. 

47

కీలకమైన పాకిస్తాన్ తో మ్యాచ్ లో అవేశ్ ను పక్కనబెట్టి రవి బిష్ణోయ్ ను  ఎంపిక చేశారు. నేడు అఫ్గాన్ తో జరుగబోయే నామమాత్రపు మ్యాచ్ లో కూడా ఇవే ప్రయోగాలు చేయనున్నది టీమిండియా. 
 

57

అయితే ఈ ప్రయోగాలపై టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ టీమిండియా మేనేజ్మెంట్ పై విమర్శలు గుప్పించాడు. మహారాష్ట్రలోని ఓ స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  దిలీప్ మాట్లాడుతూ.. ‘జట్టులో ప్రయోగాలు చేయడం మంచిదే. అదీగాక జట్టులో ఉన్న అందరికీ మ్యాచ్ లు ఆడే అవకాశం కల్పించడం కూడా  ప్రశంసించదగ్గదే. తద్వారా  వచ్చే నెలలో జరుగబోయే  ప్రపంచకప్ కోసం  కూడా ప్లేయింగ్ లెవన్ ను ఖరారు చేసుకోవచ్చు. 
 

67

కానీ ఈ టోర్నీ కూడా ముఖ్యమే కదా. ఐసీసీ టోర్నీల మాదిరిగానే ఆసియా కప్ కూడా ముఖ్యమైన టోర్నీ అని గ్రహించాలి. ఇక్కడ ప్రయోగాల కంటే విజయాలు ఎంతో ముఖ్యం. ఇక్కడ మంచి కాంబినేషన్లతో గెలిస్తే బాగుండేది.  
 

77

మీరు (టీమ్ మేనేజ్మెంట్) కావాలంటే ద్వైపాక్షిక సిరీస్ లలో ప్రయోగాలు చేసుకోవచ్చు. కానీ  ఐసీసీ టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ మాదిరిగా ఆసియా కప్ కూడా ప్రధాన టోర్నీయే కదా. ఇటువంటి టోర్నీలలో మీరు గెలవడం కోసం ఆడాలి గానీ ప్రయోగాలు చేయకూడదు...’ అని అన్నాడు. 

click me!

Recommended Stories