స్మిత్‌ చేసింది పెద్ద ఛీటింగ్... వార్నర్‌పైన జీవితకాల నిషేధం... వాడే పెద్ద నేరస్థుడు..

First Published Jan 22, 2021, 12:30 PM IST

టీమిండియా చేతుల్లో స్వంత గడ్డ మీద టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టులో ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించడం దాదాపు ఆనవాయితీగానే అనిపిస్తోంది.

టీమిండియాతో టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత స్వదేశంలో అత్యధిక టెస్టులు ఓడిన ఆసీస్ కెప్టెన్‌గా నిలిచాడు టిమ్ పైన్...
undefined
రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ వంటి కెప్టెన్ల నాయకత్వంలో క్రికెట్‌లో కొన్ని దశాబ్దాల పాటు ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇలాంటి పర్ఫామెన్స్ ఇవ్వడంతో కెప్టెన్‌ను మార్చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
undefined
దీంతో టిమ్ పైన్‌ను తొలగించి, ఇంతకుముందు ఆ జట్టుకు కెప్టెన్సీ చేసిన స్టీవ్ స్మిత్‌కే మళ్లీ నాయకత్వ పగ్గాలు అప్పగించాలని ఆలోచన చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా...
undefined
బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత స్మిత్ కెప్టెన్సీ ఊడింది. వైస్ కెప్టెన్‌గా వ్యవహారించిన డేవిడ్ వార్నర్‌, మళ్లీ వైస్‌గా కానీ, కెప్టెన్‌గా కానీ వ్యవహారించకూడదని జీవిత కాల నిషేధం పడింది...
undefined
దాంతో స్టీవ్ స్మిత్‌కే మళ్లీ కెప్టెన్సీ దక్కే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించాడు ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్.
undefined
‘బాల్ టాంపరింగ్ కేసులో వార్నర్ కంటే స్టీవ్ స్మిత్ పెద్ద నేరస్థుడు. స్మిత్‌కి కెప్టెన్సీ చేయకుండా రెండేళ్ల నిషేధం విధించి, వార్నర్‌కి జీవితకాలం విధించడం ఎందుకు?
undefined
స్మిత్‌పైన కూడా జీవితకాల నిషేధం విధించాలి... అతనిపై మాత్రం పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు ఇయాన్ చాపెల్.
undefined
టిమ్ పైన్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా ఘోరంగా విఫలమయ్యాడని, చేతుల్లోకి వచ్చిన క్యాచులను నేలవిడిచాడని కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ...
undefined
అయితే మాజీ సారథి స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే బదులు, యంగ్ పేసర్, ఐసీసీ టాప్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ టెస్టు కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు...
undefined
click me!