ఆడిలైడ్ టెస్టు తర్వాత కోహ్లీ అదే చెప్పాడు... ద్రావిడ్ మెసేజ్ పంపారు... ఆయన వల్లే... - హనుమ విహారి...

Published : Jan 22, 2021, 11:19 AM IST

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి అడ్డుగోడలా నిలబడ్డాడు తెలుగు తేజం హనుమ విహారి. ఇప్పటిదాకా విహారి ఆడిన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. తన ఆట వెనక ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ ఉన్నారని ప్రకటించాడు విహారి.

PREV
115
ఆడిలైడ్ టెస్టు తర్వాత కోహ్లీ అదే చెప్పాడు... ద్రావిడ్ మెసేజ్ పంపారు... ఆయన వల్లే... - హనుమ విహారి...

సిడ్నీ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 161 బంతుల్లో 23 పరుగులు చేసిన హనుమ విహారి... తొడ కండరాల గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్ కొనసాగించాడు...

215

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి దాదాపు 50 ఓవర్లు పాటు బ్యాటింగ్ కొనసాగించిన విహారి... సిడ్నీలో చారిత్రక ‘డ్రా’ అందించాడు.

315

‘సిడ్నీ టెస్టు తర్వాత రాహుల్ ద్రావిడ్ నాకు మెసేజ్ పంపారు. చాలా గొప్పగా బ్యాటింగ్ చేశావని మెచ్చుకున్నారు... ఆయన నాకు రోల్ మోడల్...

415

చాలా గొప్ప వ్యక్తి... రాహుల్ ద్రావిడ్‌ను క్రికెటర్‌గా, ఉన్నతమైన వ్యక్తత్వం ఉన్న వ్యక్తిగా నేను ఎంతగానో ఆరాధిస్తాను... ఆయన వల్లే నాలాంటి ఎందరో కుర్రాళ్లు జట్టులోకి వచ్చారు.

515

భారత్ ఏ జట్టుకి ఆడుతున్నప్పుడు రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన స్ఫూర్తి, స్వేచ్ఛ ఎప్పటికీ మరవలేను...

615

ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టులో ఆడిన సిరాజ్, నవ్‌దీప్ సైనీ, శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, నేను కలిసి రాహుల్ ద్రావిడ్ శిక్షణలో భారత్ ఏ జట్టుకి ఆడాం...

715

ఆ సమయంలో దాదాపు నాలుగేళ్లు రాహుల్ ద్రావిడ్ మాకు శిక్షణ ఇచ్చారు... ఆ సమయంలో టీమిండియా టూర్లతో పాటు భారత్ ఏ జట్టుకి షాడో టూర్లు ఏర్పాటు చేశారు.

815

పటిష్టమైన జట్లతో విదేశీ పిచ్‌లపై ఆడడం వల్లే నేను కూడా, మిగిలిన వాళ్లు కానీ ఇప్పుడు ఆసీస్ పర్యటనలో రాణించగలిగాం...

915

మా విజయం వెనక రాహుల్ ద్రావిడ్ ఉన్నారు, ఉంటారు... పూజారా కూడా నాకు అండగా నిలిచారు. మొదటి రెండు టెస్టుల్లో నేను పెద్దగా బ్యాటింగ్ చేయలేకపోయాను...

1015

టెస్టుల్లో టీమిండియాకి పూజారా చాలా స్పెషల్. ఆయనే బ్యాటింగ్‌కి వెన్నెముక. పూజారా క్రీజులో ఉంటే అదో పెద్ద పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది...

1115

గబ్బా టెస్టులో కూడా పూజారా వల్లే శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగారు... పూజారా ఇచ్చిన ఆత్మవిశ్వాసం అలాంటిది...

1215

ఆడిలైడ్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ చెప్పిన మాటలు కూడా జట్టులో నూతన ఉత్సాహం నింపాయి... ఒక సెషన్‌లో అంతా మారిపోయింది...

1315

అయితే మేం దాన్ని తలుచుకుని బాధపడుతూ కూర్చోలేదు... ఎక్కువగా ఆలోచించొద్దని, ఇది కేవలం మూడు టెస్టుల సిరీస్ అనుకోని ఆడాలని సూచించాడు విరాట్ కోహ్లీ...

1415

గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ నెలకొల్పిన 123 పరుగులు భాగస్వామ్యం చాలా విలువైంది. అది లేకపోతే గబ్బా టెస్టు ఫలితం వేరేలా ఉండేది...’ అంటూ చెప్పుకొచ్చాడు హనుమ విహారి.

1515

సిడ్నీ టెస్టులో గాయపడిన హనుమ విహరి, ఇంకా పూర్తిగా కోలుకొని కారణంగా వచ్చే నెల ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో ఈ క్రికెటర్‌కి చోటు దక్కలేదు.

click me!

Recommended Stories