ఐపీఎల్ ద్వారా రూ.100 కోట్లు... ఆ జాబితాలో చేరనున్న సురేశ్ రైనా, ఏబీ డివిల్లియర్స్...

First Published Jan 22, 2021, 12:06 PM IST

రూ.100 కోట్లు... చాలామంది కలలో కూడా ఊహించలేని మొత్తం. క్రికెటర్లకి ఈ మొత్తం పెద్ద మ్యాటరేం కాదు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ లాంటి స్టార్లు బ్రాండ్ అంబాసిడింగ్ ద్వారా వందల కోట్లు ఆర్జిస్తున్నారు. అయితే కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రూ.100 కోట్లు ఆర్జించారు ఐదుగురు క్రికెటర్లు.

మహేంద్ర సింగ్ ధోనీ...2008 నుంచి 2021 సీజన్ దాకా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఏకైక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ... ధోనీ ఐపీఎల్ ద్వారా ఆర్జించిన మొత్తం రూ. 137.84 కోట్లకు పైనే...
undefined
మొదటి మూడు సీజన్లు ఏటా రూ.6 కోట్లు తీసుకున్న ధోనీ, ఆ తర్వాత మూడేళ్లు ఏటా రూ.8.28 కోట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత నాలుగేళ్లు ఏటా రూ.12.50 కోట్లు తీసుకున్నాడు.
undefined
2018 నుంచి ఏటా పారితోషికం కింద రూ.15 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
రోహిత్ శర్మ...ఐపీఎల్ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జించిన రెండో క్రికెటర్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ... ఐపీఎల్ ద్వారా రోహిత్ శర్మ ఆర్జించిన మొత్తం రూ.131.60 కోట్లు...
undefined
మొదటి మూడు సీజన్లు డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఏటా రూ.3 కోట్లు తీసుకున్న రోహిత్ శర్మ, ఆ తర్వాత 2011 నుంచి 2014 దాకా ముంబై తరుపు ఏటా రూ.9.20 కోట్లు తీసుకున్నాడు.
undefined
2014 నుంచి ఏటా రూ.12.50 లక్షలు అందుకున్న రోహిత్ శర్మ, 2018 నుంచి ఏటా రూ.15 కోట్లు అందుకుంటున్నాడు....
undefined
విరాట్ కోహ్లీ...గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ...
undefined
2018 నుంచి ఏటా రూ.17 కోట్లు అందుకుంటున్న విరాట్ కోహ్లీ, 2008 నుంచి మూడేళ్ల పాటు రూ.కోటిన్నర మాత్రమే అందుకున్నాడు.
undefined
2011 నుంచి మూడేళ్ల పాటు రూ.8.28 కోట్లు, 2014 నుంచి 2017 దాకా రూ.12.5 కోట్లు వేతనంగా అందుకున్న విరాట్ కోహ్లీ... మొత్తంగా ఐపీఎల్ ద్వారా రూ.12.62 కోట్లు ఆర్జించాడు.
undefined
సురేశ్ రైనా... ఐపీఎల్ ద్వారా రూ.100 కోట్లు ఆర్జించిన నాలుగో ప్లేయర‌గా సురేశ్ రైనా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు.
undefined
2008 నుంచి 2010 దాకా ఏటా రూ.2.6 కోట్లు తీసుకున్న రైనా, ఆ తర్వాత మూడేళ్లు రూ.5.98 కోట్లు, 2014 నుంచి మూడేళ్లు రూ.9.50 కోట్లు అందుకున్నాడు.
undefined
2017లో గుజరాజ్ లయన్స్ కెప్టెన్‌గా రూ.12.5 కోట్లు అందుకున్న రైనా, ఆ తర్వాత రెండేళ్లు చెన్నై తరుపున రూ.11 కోట్లు అందుకున్నాడు. గత ఏడాది రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాల్సిన రైనా, వ్యక్తిగత కారణాలతో మిస్ కావడంతో ఆ రికార్డు మిస్ అయ్యాడు.
undefined
ప్రస్తుతం రూ.99.74 కోట్లతో ఉన్న సురేశ్ రైనా, ఐపీఎల్ వేతనంగా రూ.11 కోట్లు అందుకుని, 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలవబోతున్నాడు.
undefined
గౌతమ్ గంభీర్ఐపీఎల్ నుంచి అత్యధిక మొత్తం ఆర్జించిన ఐదో క్రికెటర్ గౌతమ్ గంభీర్. కేకేఆర్ మాజీ కెప్టెన్ ఐపీఎల్ ద్వారా రూ.94.62 కోట్లు ఆర్జించాడు. 2018లో రిటైర్మెంట్ తీసుకున్న గౌతీ, రూ.100 కోట్ల క్లబ్‌‌లో చేరే ఛాన్స్ మిస్ అయ్యాడు.
undefined
ఏబీ డివిల్లియర్స్ఐపీఎల్ ద్వారా రూ.100 కోట్లు ఆర్జించబోతున్న మొట్టమొదటి విదేశీ ప్లేయర్‌గా ఏబీ డివిల్లియర్స్‌ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ తరుపున ఏటా రూ.11 కోట్లు అందుకున్న ఏబీడీ... గత సీజన్ వరకూ ఆర్జించిన మొత్తం రూ.91.52 కోట్లు. ఈ ఏడాది రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడు ఏబీడీ.
undefined
యువరాజ్ సింగ్ రూ.84.60 కోట్లు, సునీల్ నరైన్ రూ.82.74 కోట్లు, షేన్ వాట్సన్ రూ.77 కోట్లు, ఊతప్ప రూ.75 కోట్లతో టాప్ 10లో ఉన్నారు... ధావన్, జడేజా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.యువీ, వాట్సన్ రిటైర్మెంట్ ప్రకటించగా ఊతప్ప, నరైన్కొన్నాళ్లుగా పెద్దగా ఫామ్‌లో లేరు. వచ్చే ఏడాది మెగా వేలం ఉండడంతో శిఖర్ ధావన్, జడేజాలు రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకొచ్చే అవకాశం ఉంది.
undefined
click me!