33 ఏండ్ల స్మిత్.. ఐపీఎల్ లో మొత్తంగా 103 మ్యాచ్ లు ఆడాడు. 2012లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్మిత్.. 2021 వరకూ ఐపీఎల్ లో ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, కొచ్చి టస్కర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. 103 మ్యాచ్ లు ఆడి 2,485 రన్స్ సాధించాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ కూడా ఉంది. 2022 వేలంలో స్మిత్ ను కొనడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకురాలేదు.