రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక స్టార్ క్రికెటర్... 2011 వరల్డ్‌కప్‌లో 97 పరుగుల వద్ద గంభీర్ వికెట్ తీసి...

First Published May 3, 2021, 6:28 PM IST

ఒకప్పుడు టీమిండియాతో సమానంగా పోటీపడిన జట్టు శ్రీలంక. ముత్తయ్య మురళీధరన్, కుమార్ సంగర్కర, జయవర్థనే, దిల్షాన్ వంటి స్టార్ క్రికెటర్లు జట్టుకి దూరమయ్యాక శ్రీలంక పరిస్థితి దయనీయంగా తయారైంది. చిన్నచిన్న జట్లతో కూడా చిత్తుగా ఓడిపోతున్న లంకకి మరో షాక్ తగిలింది...

శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ తిసారా పెరేరా... అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 166 వన్డేలు ఆడిన పెరేరా, 2338 పరుగులతో పాటు 175 వికెట్లు పడగొట్టాడు.
undefined
లిస్టు ఏ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తిసారా పెరేరా, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
వన్డే, టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన రెండో క్రికెటర్‌గా నిలిచిన పెరేరా, కొన్ని మ్యాచులకు శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు.
undefined
2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పెరేరా... టీమిండియాపై హ్యాట్రక్ వికెట్లు తీశాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో 97 పరుగుల వద్ద గౌతమ్ గంభీర్‌ను అవుట్ చేసింది పెరేరానే..
undefined
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కొచ్చి జట్లకు ఆడాడు. అయితే ఐపీఎల్ కెరీర్‌లో 37 మ్యాచులు ఆడిన పెరేరా 422 పరుగులతో 31 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
undefined
న్యూజిలాండ్‌పై జరిగిన వన్డేలో 57 బంతుల్లోనే సెంచరీ బాదిన పెరేరా, 13 సిక్సర్లతో చెలరేగిపోయాడు. 74 బంతుల్లో 13 సిక్సర్లు, 8 ఫోర్లతో 140 పరుగులు చేసి తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ నమోదుచేశాడు.
undefined
కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేని తిసారా పెరేరా... 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో శ్రీలంక జట్టుకు మరిన్ని కష్టాలు ఎదురుకావచ్చు.
undefined
click me!