పాజిటివ్ వచ్చినా భయపడడం లేదు, మరీ ఇలా ఉన్నారేంటండీ... ప్యాట్ కమ్మిన్స్ మేనేజర్ కామెంట్...

First Published May 3, 2021, 5:41 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆకస్మాత్తుగా కరోనా అలజడి రేపింది. కేకేఆర్ ప్లేయర్ల వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడడంతో కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా ఇండియన్ ప్లేయర్లు ఏ మాత్రం కంగారు పడడం లేదట...

వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లతో ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ కూడా కరోనా బారిన పడినట్టు ప్రచారం జరిగింది. అయితే కొద్దిగా అనారోగ్యానికి గురైన ప్యాట్ కమ్మిన్స్‌కి కరోనా టెస్టు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.
undefined
బయో బబుల్‌లో కట్టుదిట్టంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌లో ఇద్దరు ప్లేయర్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా క్రికెట్ ఫ్యాన్స్‌ షాక్‌కి గురయ్యారు. అయితే ప్లేయర్లు మాత్రం చాలా రిలాక్స్‌గా ఉన్నారట.
undefined
‘ప్యాట్ కమ్మిన్స్ కాస్త అనారోగ్యానికి గురయ్యాడు. ఇప్పుడు అతను ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడు. పాజిటివ్ రిజల్డ్ వచ్చిన ఇద్దరు తప్ప ప్లేయర్లు అందరూ క్షేమంగానే ఉన్నారు...
undefined
జట్టులో ఎవ్వరూ, ఏ ప్లేయర్ కూడా కంగారు పడడం లేదు. తమ మధ్య ఉన్న ఇద్దరు ప్లేయర్లకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న టెన్షన్ కానీ, భయం కానీ వారిలో లేదు. చాలా రిలాక్స్‌గా ఎంజాయ్ చేస్తున్నారు....
undefined
ఇదే వేరే దేశంలో అయితే పరిస్థితి ఎలా ఉండేది... ఇండియన్స్ మరీ ఇంత రిలాక్స్‌గా ఉన్నారేంటి..’ అంటూ ఆశ్చర్యపోతూ వివరించాడు ప్యాట్ కమ్మిన్స్‌ మేనేజర్ నీల్ మ్యాక్స్‌వెల్...
undefined
కొన్నాళ్ల క్రితం దేశంలోని కరోనా కేసులను చూసి చలించిపోయిన కేకేఆర్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్, 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే....
undefined
దేశంలో కోట్ల మందికి వినోదాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తున్న ఐపీఎల్‌ను బ్యాన్ చేయడం వల్ల కరోనా తగ్గదంటూ కూడా కామెంట్లు చేశాడు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్...
undefined
click me!