ఛీటింగ్ చేసి గెలిచిన శ్రీలంక!... కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ కోడ్ లాంగ్వేజ్ వాడడంపై ట్రోల్స్...

First Published Sep 2, 2022, 12:17 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడిన శ్రీలంక, బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది. ఐదు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టు, ఈ మధ్య కొన్నాళ్లుగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. అయితే లంక ఛీటింగ్ చేసి గెలిచిందని ట్రోల్స్ చేస్తున్నారు బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్...

Sri lanka vs Bangladesh

ఆసియా కప్ 2022 గ్రూప్ బీలో వరుసగా రెండు విజయాలు అందుకున్న ఆఫ్ఘనిస్తాన్, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా.. బంగ్లాదేశ్‌పై 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది శ్రీలంక.  విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్‌లో 17 పరుగులు రావడం మ్యాచ్‌ని మలుపు తిప్పేసింది...

అయితే బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శ్రీలంక హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్, డగౌట్‌లో ప్లకార్డులతో కోడ్ లాంగ్వేజ్‌లో కెప్టెన్‌ని సంకేతాలు పంపించడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది...

క్రీజులో ఉన్న కెప్టెన్‌కి రకరకాల రూపాల్లో మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారు హెడ్ కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు కానీ, నిషేధం కానీ లేదు. అయితే ఇలా నేరుగా ప్లకార్డుల ద్వారా కోడ్ లాంగ్వేజ్‌లో మెసేజ్‌లు పంపడం మాత్రం తీవ్ర వివాదాస్పదమైంది...

‘ఇది రాకెట్ సైన్స్ ఏమీ కాదు. కొన్ని సందేశాలు ఇచ్చాను, ఇలా చేస్తే బాగుంటుందని సలహాలు సూచించాను. ఇది చాలా మంచి మ్యాచ్. చాలా టీమ్‌లు ఇలా చేస్తున్నాయి. ఇవి సలహాలు మాత్రమే, కెప్టెన్సీ ఎలా చేయాలో చెప్పడం లేదు కదా...’ అంటూ కోడ్ లాంగ్వేజ్‌పై వివరణ ఇచ్చాడు క్రిస్ సిల్వర్‌వుడ్.

ఇంగ్లాండ్ జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన క్రిస్ సిల్వర్‌వుడ్, యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో ఓటమి తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పించబడ్డాడు. సిల్వర్‌వుడ్ హెడ్ కోచ్‌గా నియమించబడిన తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌పై ఒక్కో టెస్టు మ్యాచ్ గెలిచింది శ్రీలంక జట్టు.. 

ఇంతకుముందు 2021 ఐపీఎల్ సమయంలోనూ కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, ఇదే విధంగా కోడ్ లాంగ్వేజ్‌లో అప్పటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌‌కి మెసేజ్‌లు పంపాడు... ఇంగ్లాండ్, టీమిండియా ఐదో టెస్టులో శ్రేయాస్ అయ్యర్‌కి షార్ట్ బాల్స్ వేయాల్సిందిగా సంకేతాలతో సూచించాడు మెక్‌కల్లమ్..  ఆ సమయంలో దీనిపై తీవ్ర దుమారం రేగింది...

click me!