అతని కంటే ఇషాన్ కిషన్‌ని ఆడిస్తేనే బెటర్... సంజయ్ మంజ్రేకర్ కామెంట్...

First Published Jul 9, 2021, 10:02 AM IST

భారత వికెట్ కీపర్‌ సంజూ శాంసన్, ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మాహీ జట్టుకి దూరమైన తర్వాత ఒకటి రెండు అవకాశాలు వచ్చినా, వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. అయితే శ్రీలంక టూర్‌లో అతనికి అవకాశం దక్కింది...

రిషబ్ పంత్, ఇంగ్లాండ్ టూర్‌లో ఉండడంతో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌కి సంజూ శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లుగా ఎంపిక చేశారు సెలక్టర్లు...
undefined
జూలై 13 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా గడుపుతోంది. అయితే లంక సిరీస్‌లో సంజూ శాంసన్‌ కంటే ఇషాన్ కిషన్‌ను ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఆడించాలని అంటున్నాడు మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...
undefined
‘శ్రీలంక టూర్‌లో సంజూ శాంసన్ కంటే ఇషాన్ కిషన్‌ను ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఆడించాలి. ఎందుకంటే శాంసన్ కంటే ఇషాన్ కిషన్ మంచి బ్యాట్స్‌మెన్...
undefined
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీపింగ్‌కి అంత ప్రాధాన్యం ఉండదు. కాబట్టి సీనియర్ వికెట్ కీపర్‌ను మాత్రమే ఆడించాలనే నిబంధన పనికి రాదు. సంజూ శాంసన్ ఫామ్‌లో ఉంటే, అతన్ని ఎవ్వరూ ఆపలేరు...
undefined
అయితే నిలకడగా ఆడడంలో ఇషాన్ కిషన్ ది బెస్ట్ ఆప్షన్... కాబట్టి సంజూ శాంసన్ కంటే ఇషాన్ కిషన్ ముందుంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్...
undefined
అయితే ఇషాన్ కిషన్ కంటే శ్రీలంక సిరీస్‌లో సంజూ శాంసన్‌కే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ప్రాధాన్యం దక్కాలని కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...
undefined
‘ఇషాన్ కిషన్‌కి పెద్దగా అనుభవం లేదు. అతను శాంసన్ కంటే నిలకడగా బ్యాటింగ్ చేయగలడేమో కానీ బౌలర్లకు అమూల్యమైన సూచనలు, సలహాలు చేయలేడు...
undefined
సంజూ శాంసన్‌కి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా చేసిన అనుభవమూ ఉంది. అతను స్పిన్ బౌలర్లు యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్‌లకు సలహఆలు, సూచనలు ఇస్తూ మంచి రిజల్ట్ రాబట్టగలడు...’ అంటూ చెప్పుకొచ్చాడు వీవీఎస్ లక్ష్మణ్...
undefined
వైస్ కెప్టెన్‌గా ఎంపికైన భువనేశ్వర్ కుమార్‌తో పాటు దీపక్ చాహార్‌ను పేసర్‌గా ఎంచుకోవాలని, వీరితో పాటు హార్ధిక్, కృనాల్ పాండ్యాలను ఆల్‌రౌండర్లుగా ఆడించాలని సూచించాడు వీవీఎస్ లక్ష్మణ్..
undefined
click me!