SRH vs MI, IPL 2025: ఇండియన్స్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025తో సర్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని ఎదుర్కొంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమైన ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ టీమ్ మ్యాచ్ ను కోల్పోయింది. ముంబై ఇండియన్స్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
Rohit Sharma and Suryakumar Yadav
ఐపీఎల్ 2025 41వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ తలపడింది. ఉప్పల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ కు మంచి ఆరంభం లభించలేదు. టాపార్డర్ ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. దీంతో ఐపీఎల్ పవర్ ప్లే లో తక్కువ స్కోర్ చేసిన టీమ్ చెత్త రికార్డును సాధించింది. 4 ఓవర్లలో 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మలు నిరాశపరిచారు.
Ishan Kishan
అయితే, కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ క్రీజులోకి ఎప్పుడైతే వచ్చాడో హైదరాబాద్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అతనికి తోడుగా ఇంపాక్టు ప్లేయర్ గా వచ్చిన అభినవ్ మనోహర్ కూడా మంచి నాక్ ఆడాడు. హెన్రిచ్ క్లాసెన్ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
అభినవ్ 43 పరుగుల ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, దీపక్ చాహర్ కు 2, బుమ్రా 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నారు.
144 పరుగులు టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 11 పరుగుల వద్ద త్వరగానే అవుట్ అయ్యాడు. కానీ, మరో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన నాక్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ హైదరాబాద్ బౌలింగ్ ను దంచికొట్టాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు.
విల్ జాక్స్ 22 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. 19 బంతుల్లో 40 పరుగులు తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులతో విజయాన్ని అందుకుంది.
Rohit Sharma
వరుసగా మూడు మ్యాచ్ లలో గెలిచి ముంబై ఇండియన్స్ మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. హైదరాబాద్ టీమ్ ఓటమితో మిగిలిన అన్ని మ్యాచ్ లను తప్పక గెలవడంతో పాటు రన్ రేటు మెరుగ్గా ఉంచుకుంటే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది.
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో 3వ స్థానంలోకి చేరింది. మొదటి రెండు స్థానాల్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. 4వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది.