Published : Apr 23, 2025, 11:50 PM ISTUpdated : Apr 24, 2025, 07:03 AM IST
SRH vs MI IPL 2025: ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 170 వికెట్లు తీసి లసిత్ మలింగ రికార్డును సమం చేశాడు. అలాగే, టీ20 క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ వికెట్లు సాధించాడు.
Jasprit Bumrah completes 300 T20 wickets: జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్ లో మరో మైలురాయిని అందుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తున్న ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా టీ20 క్రికెట్ లో 300 వికెట్లు తీసుకున్నాడు.
25
Image Credit: Getty Images
ఐపీఎల్ 2025లో 41వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్ ను తీసుకున్న తర్వాత బుమ్రా 300 టీ20 వికెట్లను పూర్తి చేశాడు. అలాగే, అత్యంత వేగంగా టీ20 క్రికెట్ లో 300 వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా రికార్డు సాధించాడు. కేవలం 237 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనత సాధించాడు.
అలాగే, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా 170 వికెట్లతో లసిత్ మలింగ రికార్డును సమం చేశాడు.
35
Bumrah completes 300 T20 wickets
టీ20 క్రికెట్ లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న ఐదో భారత బౌలర్ గా కూడా బుమ్రా ఘనత సాధించాడు. బుమ్రా కంటే ముందు యుజ్వేంద్ర చాహల్, పియూష్ చావ్లా, భువనేశ్వర్ కుమార్, ఆర్ అశ్విన్ లు టీ20 క్రికెట్ లో 300 వికెట్లు పూర్తి చేశారు.
బుమ్రా టీ20 క్రికెట్ లో గుజరాత్ తరఫున 38 వికెట్లు, టీమిండియా తరఫున 89 వికెట్లు, ముంబై ఇండియన్స్ తరఫున 173 వికెట్లు పడగొట్టాడు. ఛాంపియన్స్ లీగ్ T20లో మూడు వికెట్లు ఉన్నాయి.
45
SRH vs MI IPL 2025: Jasprit Bumrah completes 300 T20 wickets
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు
1) యుజ్వేంద్ర చాహల్ - 373
2) పియూష్ చావ్లా - 319
3) భువనేశ్వర్ కుమార్ - 318
4) ఆర్ అశ్విన్ - 315
5) జస్ప్రీత్ బుమ్రా - 300
55
Jasprit Bumrah completes 300 T20 wickets
అలాగే, మ్యాచ్‌ల వారీగా టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన 5వ బౌలర్ గా బుమ్రా నిలిచాడు.