IPL : ఈడు మామూలోడు కాదు బాబోయ్! ఇషాన్ కిషన్ ఊచకోతకు చెన్నై ఖేల్ ఖతం!

Published : May 19, 2026, 06:55 AM IST

Ishan Kishan : ఐపీఎల్ 2026లో చెన్నైపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ (70 పరుగులు) అదిరిపోయే హాఫ్ సెంచరీతో జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ధోనీ కోటలో ఇషాన్ కిషన్ ఊచకోతతో సీఎస్కే పనైపోయింది.

PREV
15
చెన్నైపై హైదరాబాద్ ఊరమాస్ గెలుపు.. హీరో ఇషాన్ కిషనే!

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాస్ పర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన 63వ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది.

ఎస్ఆర్‌హెచ్ విజయంలో యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ 70 పరుగులతో సూపర్ నాక్ తో విజయాన్ని అందించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. 2013 తర్వాత చెన్నైలో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయిన హైదరాబాద్‌ జట్టుకు, చెపాక్‌లో సీఎస్‌కేపై ఇది బ్యాక్-టు-బ్యాక్ సక్సెస్ కావడం విశేషం. అలాగే ఒకే ఐపీఎల్ సీజన్‌లో చెన్నైని రెండుసార్లు ఓడించడం ఎస్ఆర్‌హెచ్ చరిత్రలో ఇదే తొలిసారి.

25
ఇషాన్ కిషన్ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. చెన్నై బౌలర్లకు చుక్కలు

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ తర్వాత 181 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ త్వరగానే అవుట్ అయినా, అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 

నంబర్ 3 పొజిషన్‌లో వచ్చిన కిషన్ క్లాస్ అండ్ మాస్ షాట్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై అస్సలు తగ్గకుండా 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుపు అంచుల్లోకి చేర్చాడు. 19వ ఓవర్లో అవుట్ అయ్యే సమయానికి హైదరాబాద్‌ను విక్టరీకి చేరువ చేశాడు.

35
క్లాసెన్ ఊచకోత.. కిషన్ సూపర్ పార్టనర్‌షిప్

అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ మ్యాచ్ మూమెంటంను పూర్తిగా మార్చేశాడు. చెన్నై స్పిన్నర్లు అకీల్ హొసేన్, నూర్ అహ్మద్ ఒత్తిడి పెంచుతున్న టైంలో క్లాసెన్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టాడు. ఇషాన్ కిషన్ ఒక ఎండ్ లో సపోర్ట్ ఇస్తుంటే, క్లాసెన్ మాత్రం సిక్సర్లు, ఫోర్లతో చెన్నై బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 75 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఎస్ఆర్‌హెచ్‌ను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టారు. క్లాసెన్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి స్టంప్ అవుట్ అయ్యాడు.

45
చెపాక్‌లో సైలెన్స్.. క్లోజింగ్ టచ్ ఇచ్చిన అరోరా, స్మరణ్

క్లాసెన్ అవుట్ అయ్యాక నితీష్ రెడ్డి (11) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం 18వ ఓవర్లో ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఒక ఫోర్, ఒక సిక్స్ బాది చెపాక్ స్టేడియంను సైలెంట్ చేసేశాడు. ఆఖర్లో సలీల్ అరోరా 18.1 ఓవర్లో కంబోజ్ వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచడంతో హైదరాబాద్ విజయానికి ఒకే ఒక్క రన్ అవసరమైంది. ఇషాన్ అవుట్ అయినా, స్మరణ్ రవిచంద్రన్ 19వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి 19 ఓవర్లలోనే 181/5 స్కోరుతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి 2 వికెట్లు తీశాడు.

55
ఎమోషనల్ అయిన ఇషాన్ కిషన్

మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. "వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడే పిచ్ ఈజీగా లేదని అర్థమైంది. స్పిన్నర్లు వేసే స్లో బాల్స్ ఆడటం కష్టం. అందుకే నంబర్ 3 బ్యాటర్‌గా మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యా. ఈ రోజు మా కజిన్ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నాడు. వాళ్ల సిస్టర్ చనిపోవడంతో మా ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది. వాళ్ల కోసమే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనుకున్నా, దేవుడి దయ వల్ల అది సాధ్యమైంది" అంటూ ఇషాన్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇషాన్, క్లాసెన్ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు.

Read more Photos on
click me!

Recommended Stories