తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన సన్‌రైజర్స్... బెయిర్ స్టో, మనీశ్ పాండే, సమద్ పోరాడినా...

Published : Apr 11, 2021, 11:08 PM IST

IPL 2021: 188 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి 10 పరుగుల తేడాతో విజయం దక్కింది.   

PREV
19
తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన సన్‌రైజర్స్... బెయిర్ స్టో, మనీశ్ పాండే, సమద్ పోరాడినా...

హర్భజన్ సింగ్ వేసిన మొదటి ఓవర్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డేవిడ్ వార్నర్‌ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్‌కి చేర్చాడు. 4 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు వార్నర్.

29

డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను షకీబ్ అల్ హసన్ మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ చేశాడు. 6 బంతుల్లో ఓ సిక్సర్‌తో ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు సాహా...

39

10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బెయిర్ స్టో, మనీశ్ పాండే కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 92 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు...

49

40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసిన జానీ బెయిర్‌ స్టోను ప్యాట్ కమ్మిన్స్ పెవిలియన్ చేర్చాడు. 102 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్...

59

ఆ తర్వాత మహ్మద్ నబీ 11 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ కాగా విజయ్ శంకర్ 7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

69

ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో 15 పరుగులు రాబట్టిన అబ్దుల్ సమద్, విజయంపై ఆశలు రేపాడు... అయితే మనీశ్ పాండే భారీ షాట్స్ కొట్టేందుకు ఇబ్బంది పడ్డాడు.

79

విజయానికి ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు కావాల్సిన దశలో ఆండ్రూ రస్సెల్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

89

అబ్దుల్ సమద్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేయగా మనీశ్ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

99

మహ్మద్ నబీ, విజయ్ శంకర్ కంటే ముందు అబ్దుల్ సమద్‌ బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి...

click me!

Recommended Stories