వికెట్లను నమస్కరిస్తూ క్రికెటర్ శ్రీశాంత్ రీఎంట్రీ... తొలి మ్యాచ్‌లో వికెట్ తీసి...

Published : Jan 12, 2021, 02:52 PM IST

‘మిస్టర్ కూల్’ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టులో అగ్రెసివ్ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ప్లేయర్ శ్రీశాంత్. వికెట్ తీసినప్పుడు వీరావేశంతో ఊగిపోయినా, సిక్సర్ కొట్టిన తర్వాత బౌలర్ ముందుకెళ్లి తీన్‌మార్ స్టెప్పులు వేసినా శ్రీశాంత్‌కే చెల్లింది. జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జట్టుకి దూరమయ్యాడు శ్రీశాంత్.

PREV
112
వికెట్లను నమస్కరిస్తూ క్రికెటర్  శ్రీశాంత్ రీఎంట్రీ... తొలి మ్యాచ్‌లో వికెట్ తీసి...

ఏడేళ్ల నిషేధం తర్వాత మళ్లీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు శ్రీశాంత్...

212

కేరళ జట్టులో చోటు దక్కించుకున్న శ్రీశాంత్, యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఆడుతున్నాడు...

312

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు శ్రీశాంత్. 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు...

412

పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో కేరళ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది... శ్రీశాంత్ ఓ వికెట్ తీయగా, జలజ్ సక్సేనా 3 వికెట్లు పడగొట్టాడు.

512

మొదట బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది... అజ్విత్ రాజీవ్ 33 పరుగులతో రాణించాడు.

612

కేరళ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది.  సంజూ శాంసన్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేయగా మహ్మద్ అజారుద్దీన్ 18 బంతుల్లో 30 పరుగులు చేశాడు. 

712
ఏడేళ్ల తర్వాత క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్... సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో ఆడుతున్న మొదటి మ్యాచ్‌లో బౌలింగ్ వేసిన తర్వాత వికెట్లను నమస్కరించాడు...

812

37 ఏళ్ల శ్రీశాంత్... దాదాపు 2804 రోజుల తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తిరిగి భారత జట్టులోకి వస్తానంటున్నాడు శ్రీశాంత్...

912

7 ఏళ్ల తర్వాత ఆడిన మొదటి మ్యాచ్‌లోనే రెండో ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు శ్రీశాంత్. అద్భుతమైన స్వింగర్‌తో పుదుచ్చేరి బ్యాట్స్‌మెన్ ఫబిద్ అహ్మద్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు శ్రీశాంత్. 

1012

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 76 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

1112

శిఖర్ ధావన్ 23 పరుగులు చేయగా నితీశ్ రాణా 37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. 

1212

భారీ లక్ష్యచేధనలో ముబై జట్టు 18.1 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులకే అవుట్ కాగా శివమ్ దూబే 42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. 

click me!

Recommended Stories