ఐపీఎల్ 2021‌లోకి శ్రీశాంత్ రీఎంట్రీ... స్వయంగా పేరు నమోదుచేసుకున్న కేరళ పేసర్...

First Published Jan 24, 2021, 11:11 AM IST

ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఏడేళ్లు క్రికెట్‌కి దూరమైన టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్... మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు ఐపీఎల్‌నే మార్గంగా ఎంచుకున్నాడు. ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత సొంత రాష్ట్రం కేరళ ద్వారా సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పాల్గొన్న శ్రీశాంత్... ఈ టోర్నీలో ఇప్పటిదాకా మంచి ప్రదర్శనే ఇచ్చాడు...

చివరిసారిగా 2013లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఐపీఎల్‌లో ప్రాతినిథ్యం వహించాడు శ్రీశాంత్...
undefined
ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 44 మ్యాచులు ఆడిన శ్రీశాంత్... 40 వికెట్లు పడగొట్టాడు. ఆర్‌సీబీపై 29 పరుగులే మూడు వికెట్లు తీయడం శ్రీశాంత్ బెస్ట్ ప్రదర్శన...
undefined
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ప్రదర్శన తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తనను కలిశాయని, తనను తీసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాయని ప్రకటించాడు శ్రీశాంత్...
undefined
ఐపీఎల్‌లో ఏడేళ్లుగా ప్రాతినిథ్యం లేని కారణంగా తనకి తానుగా మినీ వేలానికి రిజిస్టర్ చేయించుకున్నాడు శ్రీశాంత్...
undefined
37 ఏళ్ల శ్రీశాంత్‌ను ఐపీఎల్ 2021లో మూడు జట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని టాక్ వినబడుతోంది...
undefined
ప్రదర్శన కంటే అనుభవాన్ని ఎక్కువగా నమ్మే చెన్నై సూపర్ కింగ్స్... శ్రీశాంత్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం...
undefined
శ్రీశాంత్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో కెప్టెన్‌గా ఉండి, తనకు సహకరించిన మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్‌లో తన కమ్‌బ్యాక్‌కి సాయపడతాడని ఈ సీనియర్ పేసర్ భావిస్తున్నాడు...
undefined
సరైన డెత్ ఓవర్ బౌలర్లు లేకపోవడంతో విజయం దాకా వచ్చిన మ్యాచ్‌లను కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా శ్రీశాంత్‌ను కొనుగోలు చేయడానికి ట్రై చేస్తోందట...
undefined
శ్రీశాంత్ మాజీ టీమ్ రాజస్థాన్ రాయల్స్‌ది కూడా సేమ్ ఇదే పరిస్థితి. డెత్ ఓవర్లలోనే వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ల కోసం అన్వేషిస్తోంది ఆర్ఆర్. సీనియర్ పేసర్ శ్రీశాంత్ కోసం రాజస్థాన్ రాయల్స్ పోటీపడవచ్చని విశ్లేషకుల అంచనా..
undefined
స్పాట్ ఫిక్సింగ్, క్రికెట్ బ్యాన్, సినిమాలు, టీవీ షోలు, రాజకీయాలు... ఇలా అన్ని రంగాల్లోనూ రాణించడానికి ట్రై చేసి మళ్లీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్... ఐపీఎల్ 2021లో ఎంట్రీ ఇచ్చి అదరగొడితే మాత్రం చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు. మళ్లీ భారత జట్టు తరుపున ఆడాలనేదే ఇప్పుడు శ్రీశాంత్ లక్ష్యం...
undefined
click me!