విరాట్ కోహ్లీ చరిష్మా ముందు షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రాలు ఎంత గురూ.. ! లెక్క తేల్చి ప‌డేశాడు !

First Published | Jan 2, 2024, 11:54 AM IST

Most popular Asian person Virat Kohli: బాలీవుడ్, గ్లోబ‌ల్ స్టార్స్ గా వెలుగొందుతున్న షారూఖ్ ఖాన్,  ప్రియాంక చోప్రాలను భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. అత్యంత ప్రజాదరణ పొందిన ఆసియా వ్యక్తిగా కింగ్ కోహ్లీ స‌రికొత్త రికార్డు సృష్టించాడు.
 

Virat Kohli, Shah Rukh Khan, Priyanka Chopra

Virat Kohli: భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ చరిష్మా, పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. గ్లోబల్ ఐకాన్లలో ఒకరైన కింగ్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2023లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ బ్యాట‌ర్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు తనపేరిట అనేక రికార్డులు సైతం నెల‌కొల్పాడు. 2023లో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ద‌మ్మురేపిన విరాట్.. జ‌ట్టుకు క‌ప్పును అందించ‌లేక‌పోయాడు. అయినా విరాట్ కోహ్లీ పాపులారిటీ  ఏమాత్రం త‌గ్గ‌లేదు. 
 

2023లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన విరాట్ కోహ్లీ పాపులారిటీ మరింత పెరిగింది. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్, గ్లోబ‌ల్ స్టార్స్ గా వెలుగొందుతున్న షారూఖ్ ఖాన్,  ప్రియాంక చోప్రాలను భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. అత్యంత ప్రజాదరణ పొందిన ఆసియా వ్యక్తిగా కింగ్ కోహ్లీ స‌రికొత్త రికార్డు సృష్టించాడు.
 


2023 లో ఆసియన్లలో అత్యధిక మంది వీక్షించిన వికీపీడియా పేజీల జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రాలను విరాట్ కోహ్లీ అధిగమించాడు. ఈ జాబితా ప్రకారం విరాట్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆసియా వ్యక్తిగా నిలిచాడు. 10.7 మిలియన్ల మందికి పైగా విరాట్ కోహ్లీ వికీపీడియా పేజీని సందర్శించారు.
 

ఇటీవల సూపర్ స్పోర్ట్ పార్క్ లో జరిగిన తొలి బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు త‌న బ్యాట్ తో అద‌ర‌గొట్టి.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఒక క్యాలెండర్ ఇయర్ లో 2000+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా కోహ్లీ  చ‌రిత్ర సృష్టించాడు.  ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక (ఆరుసార్లు) 2000+ పరుగులు చేసిన శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను విరాట్ కోహ్లీ అధిగమించాడు.
 

Virat Kohli

2023లో అన్ని ఫార్మాట్లలో కలిపి 2000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ (1934) 66 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 38 పరుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 28 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టాడు.
 

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆరు సెంచరీలతో సహా 1724 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా  కోహ్లీ అధిగమించాడు. దక్షిణాఫ్రికాలో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఐదు సెంచరీలతో 1750 పరుగులు చేశాడు. వన్డేల్లో దక్షిణాఫ్రికాలో భారత బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 74.83 సగటుతో 898 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
 

Latest Videos

click me!