Laura Wolvaardt: లారా హాట్ ఫోజులకు కుర్రకారు ఫిదా.. సఫారీ బ్యాటర్ ఒంపు సొంపులకు హాలీవుడ్ హీరోయిన్లూ దిగదుడుపే

Published : May 27, 2022, 11:47 AM IST

Women's T20 Challenge 2022: దక్షిణాఫ్రికా యువ క్రికెటర్, ప్రస్తుతం ఉమెన్స్ టీ20 ఛాంపియన్-2022 లో  తన ఆటతో పాటు అందంతో కూడా మతిపోగొడుతోంది లారా వోల్వార్డ్ట్. 

PREV
17
Laura Wolvaardt: లారా హాట్ ఫోజులకు కుర్రకారు ఫిదా.. సఫారీ బ్యాటర్ ఒంపు సొంపులకు హాలీవుడ్ హీరోయిన్లూ దిగదుడుపే

మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఛాంపియన్ 2022 లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లారా వోల్వార్డ్ట్ తన ఆటతో పాటు అందంతో కూడా  కుర్రకారు హృదయాలను దోచుకుంటున్నది. 

27


ప్రస్తుత సీజన్ లో వెలోసిటీ తరఫున ఆడుతున్న ఈ సఫారీ భామ.. ఈ సీజన్ లో  రెండు మ్యాచులాడి 68 పరుగులు చేసింది. సూపర్ నోవాస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆమె హాఫ్  సెంచరీ సాధించి ఆ  జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 

37

ఇక గురువారం రాత్రి ట్రయల్ బ్లేజర్స్ తో జరిగిన ఆఖరి లీగ్ దశలో కూడా క్రీజులో ఉన్నది తక్కువ సేపే అయినా  దూకుడుగా ఆడింది.  2 ఫోర్లు కొట్టి జోరు మీదున్న ఆమెను పూనమ్ యాదవ్ ఔట్ చేసింది. 

47

దక్షిణాఫ్రికాకు చెందిన లారా..  సఫారీ జాతీయ జట్టుతో పాటు పలు ఇతర దేశాల లీగ్ లలోనూ మెరుస్తున్నది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో ఆమె అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నది. 2013 లో సఫారీ అండర్ -19 జట్టులోకి వచ్చిన ఈమె.. 2016 లో  సీనియన్ జట్టులోకి వచ్చింది. ఇంగ్లాండ్ తో మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా అరంగేట్రం చేసింది. 

57

అదే ఏడాది లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీ చేయడం ద్వారా అతి చిన్న వయసు (17) లోనే  శతకం చేసిన  తొలి దక్షిణాఫ్రికా మహిళా  క్రికెటర్ గా రికార్డులకెక్కింది.  ఇటీవలే ముగిసిన  మహిళల  వన్డే ప్రపంచకప్ లో కూడా లారా రాణించింది. 

67

ఇప్పటివరకు సఫారీ జట్టు తరఫున 71 వన్డేలు ఆడిన లారా.. 2,832 పరుగులతో దూసుకుపోతున్నది. ఇందులో 3 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. టీ20 లలో 33 మ్యాచులాడి 588 పరుగులు చేసింది. 

77

మ్యాచ్ లు లేని సమయాల్లో వెకేషన్ ఎంజాయ్ చేసే  లారా.. తన లేలేత అందాలను బికినీ లలో చూపిస్తూ కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్నది. తాజాగా ఆమె ఉమెన్స్ టీ20 ఛాంపియన్షిప్ లో మెరుస్తుండటంతో ఇండియాలో కూడా ఆమె కు ఫాలోయింగ్ పెరుగుతున్నది. 

click me!

Recommended Stories