అలా పాటలు పాడినందుకు నన్ను క్షమించండి... సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బ్రౌచర్...

First Published Aug 24, 2021, 3:49 PM IST

సఫారీ క్రికెట్ టీమ్‌పై వర్ణ వివక్ష, జాతి వివక్ష వివాదం కుదిపేస్తోంది. ఇప్పటికే సౌతాఫ్రికా గ్రేట్ కెప్టెన్లుగా చెప్పుకునే గ్రేమ్ స్మిత్, ఏబీ డివిల్లియర్స్‌పై కూడా రేసిజం మరకలు పడ్డాయి. టీమిండియా మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత హెడ్ కోచ్ మార్క్ బ్రౌచర్ కూడా ఈ వివాదంలో చిక్కుకున్నాడు...

మార్క్ బ్రౌచర్, సౌతాఫ్రికా జట్టులోని నల్లజాతీయులను ఉద్దేశించి, వారిని కించపరిచే విధంగా పాటలు పాడేవాడని, అలాగే వారిని పిచ్చిపిచ్చి నిక్‌నేమ్స్ పిలిచి అవమానించేవాడని ఆరోపణలు వచ్చాయి... దీనిపై తాజాగా స్పందించాడు మార్క్ బ్రౌచర్...

సౌతాఫ్రికా క్రికెట్ సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీ (ఎస్‌జేఎన్)కి 14 పేజీల అఫిడెవిట్‌ని సమర్పించిన మార్క్ బ్రౌచర్, జట్టులో ఉన్నప్పుడు తాను చేసిన పనులకు బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నట్టు తెలియచేశాడు...

‘మా టీమ్‌ మేట్స్‌‌ ఇబ్బందిపడే విధంగా పాటలు పాడినందుకు, వారికి అసభ్యకరమైన నిక్‌నేమ్స్ ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా... 

మీరు చేసిన ఆరోపణల్లో నిజం ఉన్నా, లేకున్నా నా ప్రవర్తన కారణంగా మీరు ఇబ్బందికి గురయ్యారని భావిస్తున్నా, అందుకే నిర్మోహమాటంగా అందరినీ క్షమించమని కోరుతున్నా...

మేం ఈ వాతావరణాన్ని అలవాటు కాలేకపోయాం. అందుకే కొన్ని తెలిసి, కొన్ని తెలియక తప్పులు చేశాం. ఒక్కసారిగా మాపై ఇలా వర్ణవివక్ష ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు...

మీడియా, సోషల్ మీడియా కారణంగా ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ప్రెషర్‌ను తట్టుకుని, వారి నుంచి పర్ఫామెన్స్ రాబట్టడం ఎలాగో తెలియడం లేదు...

అయితే ఇకపై జట్టులో సమానత్వం, గౌరవం ప్రతీ ఒక్క ఆటగాడికి దక్కేలా చర్యలు తీసుకుంటాం. అయితే ఇంతకుముందు ఓ ఆటగాడిని ఎలా ఎంపిక చేయాలనే విషయంలో సరైన మార్గదర్శకాలు లేవు...

అంతేకాదు భిన్నమతాలు, భిన్న వర్ణాల ప్లేయర్లు కలిసి ఆడుతున్నప్పుడు, ఒక ఆటగాడితో మరో ఆటగాడు ఎలా మసులుకోవాలో కూడా మాకు ఎవ్వరూ చెప్పలేదు. క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు కూడా ఇలాంటి విషయాలను చూసుకోవడానికి ఎవ్వరినీ నియమించింది లేదు...

వర్ణ వివక్ష వివాదం రేగిన తర్వాత మేం, సౌతాఫ్రికా జట్టు, కోచింగ్ స్టాఫ్, సెలక్టర్లు, మరియు క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు కలిసి ఈ విషయం గురించి చాలా సున్నితంగా ఆలోచించి, నడుచుకున్నాం...

జట్టులో ప్రతీ ప్లేయర్, తాము ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించేలా, ఈ విషయం గురించి మాట్లాడేలా పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఎంతో దూరదృష్టి, మానసిక పరిపక్వతతో చేసిన ఈ పని, ముందు తరాల వారికి ఓ గుణపాఠంగా నిలుస్తుందని అనుకుంటున్నా...

తెలిసీ తెలియని యుక్తవయసులో నేను చేసిన పనుల వల్ల నా టీమ్ మేట్స్ ఇబ్బంది పడ్డారని తెలిసింది. దానికి నేను హృదయపూర్వకంగా మరోసారి క్షమాపణలు చెబుతున్నా... ’ అంటూ తెలిపాడు మార్క్ బ్రౌచర్...

click me!