బుమ్రా నన్ను భయపెట్టాడు కానీ జో రూట్ అక్కడ తప్పు చేశాడు... జేమ్స్ అండర్సన్ కామెంట్...

First Published Aug 24, 2021, 2:31 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు కోసం క్రికెట్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్టులంటే పెద్దగా ఇష్టపడనివారు కూడా, ఈ టెస్టు కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం బుమ్రా, అండర్సన్ మధ్య జరిగిన గొడవ తర్వాత ఇరు జట్ల మధ్య ఏర్పడిన ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ వాతావరణమే...

లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జేమ్స్ అండర్సన్ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో జస్ప్రిత్ బుమ్రా వేసిన బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులు హాట్ టాపిక్ అయ్యాయి... అండర్సన్ బాడీని టార్గెట్ చేసినట్టుగా బుమ్రా వేసిన బంతులు... ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధానికి తెర తీశాయి...

‘నేను బ్యాటింగ్‌కి వచ్చే సమయానికి మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ పిచ్ స్లోగా ఉందని చెప్పారు. నాన్ స్టైయికింగ్‌లో ఉన్న జో రూట్ కూడా బుమ్రా మామూలుగా బౌలింగ్ వేస్తున్నాడని, ఫాస్ట్‌గా రావడం లేదని చెప్పాడు...

అయితే నాకు వచ్చిన మొదటి బంతే... 90 మైళ్ల వేగంతో దూసుకొచ్చింది. ఆ తర్వాత బంతి కూడా అదే వేగం... బుమ్రా వేసిన బంతులు చూస్తుంటే... అతను నన్ను అవుట్ చేయడానికి బౌలింగ్ చేస్తున్నట్టు అనిపించలేదు...

బుమ్రా ఓ ఓవర్ బౌలింగ్ చేసి ఉండొచ్చు, లేదా 10, 11, 12 బంతులు వేసి ఉండొచ్చు. కానీ అతను నన్నే టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించింది... నో బాల్స్ మీద నో బాల్స్ వేస్తూ... షార్ట్ పిచ్ బంతులు సంధించాడు. అతను కేవలం రెండు బాల్స్ మాత్రమే స్టంప్స్ మీదకి వేశాడు. వాటిని నేను ఆడగలిగాను...

బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది. నా కెరీర్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అందుకే ఎలాగైనా వికెట్ కాపాడుకుని, జో రూట్‌కి స్ట్రైయిక్ ఇవ్వాలని అనుకున్నాను...’ అంటూ చెప్పుకొచ్చాడు జేమ్స్ అండర్సన్...

‘బుమ్రా బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు జో రూట్ కావాలని మార్క్ వుడ్‌కి బౌలింగ్ ఇచ్చాడు. అతను తన ఇగో, ఎమోషన్‌ని సంతృప్తిపరుచుకోవడానికి ఇలా చేసి ఉండొచ్చు. అయితే ఇదే మ్యాచ్‌ను మలుపుతిప్పింది...

బుమ్రాను అవుట్ చేయకుండా బౌన్సర్లతో దాడి చేయాలని చూశారు. బుమ్రా వచ్చినప్పుడు నాతోనే బౌలింగ్ చేయించాల్సింది. నా బౌలింగ్‌లో బుమ్రా పెద్ద షాట్స్ ఆడి ఉంటే, వుడ్‌కి బౌలింగ్ ఇవ్వాల్సింది...

జో రూట్ చేసిన ఆ తప్పు వల్లే, టీమిండియా ప్లేయర్లు ఒక్కటై విరుచుకుపడ్డారు. ఐదో రోజు వాళ్లు బాగా ఆడారు. అదీకాకుండా మేం కొన్ని క్యాచులను, అవకాశాలను వదిలేశాం... వచ్చిన క్యాచులను అందుకుని ఉంటే, రిజల్ట్ వేరేగా ఉండేది...

టీమిండియా చాలా కసిగా ఆడింది. మాతో పోలిస్తే, వాళ్లు ఎమోషన్‌ను సరిగ్గా వాడారు. ఐదోరోజు ఆటలో అది స్పష్టంగా కనిపించింది. మిగిలిన మూడు మ్యాచుల్లో ఈ విషయం గురించి ఆలోచించాల్సి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్...

మొదటి టెస్టులో ఐదో రోజు వర్షం కారణంగా విజయాన్ని అందుకోలేకపోయిన టీమిండియా, లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి 158 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది భారత జట్టు.

click me!