WTC 2025 Final: ఆస్ట్రేలియాకు షాక్.. డబ్ల్యూటీసీ 2025 విజేత‌గా సౌతాఫ్రికా

Published : Jun 14, 2025, 05:49 PM IST

AUS vs SA: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 లో సెంచూరియన్ ఐడెన్ మార్క్రామ్ అద్భుత‌మైన 136 పరుగుల ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియ‌న్ గా నిలిచింది.

PREV
15
సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది

లార్డ్స్ మైదానంలో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ 2025లో సౌతాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా డ‌బ్ల్యూటీసీ టైటిల్‌ను అందుకుంది. ఆసీస్‌పై 5 వికెట్ల గెలుపుతో డబ్ల్యూటీసీ క‌ప్ కు గెలుచుకుంది. 

282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఐడెన్ మార్క్రమ్ 136 పరుగుల సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, ప్రోటీస్ జట్టు కెప్టెన్ టెంబా బవుమా హాఫ్ సెంచరీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

25
ఐడెన్ మార్క్రమ్ సూపర్ నాక్

టెస్ట్‌లో 250 పైగా పరుగుల విజయ లక్ష్యాన్ని 17 ఏళ్ల తర్వాత ఛేదించిన సౌతాఫ్రికా, ఈ మ్యాచ్‌లో 282/5తో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులు మాత్రమే చేసిన సఫారీ జట్టు, రెండవ ఇన్నింగ్స్‌లో విశేషంగా రాణించింది. 

ఐడెన్ మార్క్రమ్ తన 136 పరుగుల ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. బవుమా 65 పరుగులు చేసి కీలకంగా నిలిచాడు. ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్హామ్ కూడా కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకుని జట్టుకు మంచి ఇన్నింగ్స్ లను ఆడారు.

35
డబ్ల్యూటీసీ ఫైనల్ 2025: చివరి రోజు నాటకీయ మలుపులు

నాల్గవ రోజు ప్రారంభంలోనే బవుమా ఔటవడంతో ఆసీస్‌కు అవకాశాలు మెరుగయ్యాయి. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్‌వుడ్‌లు తమ అనుభవాన్ని చూపించారు. కానీ ఐడెన్ మార్క్రమ్ ధైర్యంగా నిల‌బడి వారి బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపించాడు.

45
డబ్ల్యూటీసీ ఫైనల్ 2025: విన్నింగ్ ముమెంట్స్

విన్నింగ్ ర‌న్స్ వచ్చినప్పుడు సఫారీ డ్రెస్సింగ్‌రూమ్ ఆనందంతో ఉరకలేసింది. ఆసీస్ 212, 207 పరుగులు చేయగా, సఫారీస్ 138, 282/5 పరుగులతో మ్యాచ్‌ను ముగించారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా వరుసగా 8వ టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.

55
27 ఏళ్ల త‌ర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన సౌతాఫ్రికా జ‌ట్టు

27 ఏళ్లుగా ఐసీసీ పోటీల్లో ట్రోఫీ అంచుల వరకు వెళ్లి విజయం దక్కని దురదృష్టాన్ని ఈసారి సఫారీ జట్టు పటిష్టంగా ఛేదించింది. లార్డ్స్ మైదానంలో ఐసీసీ ట్రోఫీని ఎత్తడం, ప్రపంచ క్రికెట్ చరిత్రలో సఫారీలకు గొప్ప క్ష‌ణాలుగా నిలిచాయి.

ఈ విజయంతో సౌతాఫ్రికా క్రికెట్ అభిమానులకు ఎన్నో ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు వచ్చింది. ఇప్పుడీ జట్టు నాయ‌కుడు బవుమా నాయకత్వంలో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా నిలవడంతో చరిత్రలో నిలవనుంది.

Read more Photos on
click me!

Recommended Stories