ఆ టైమ్‌లో సౌరవ్ గంగూలీ లేకపోతే, పరిస్థితి ఇలా ఉండేది కాదు! - టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్

Published : Jul 10, 2023, 10:49 AM IST

మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని, భారత క్రికెట్ చీకటి రోజులు అనుభవిస్తున్న సమయంలో భారత కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు సౌరవ్ గంగూలీ. 2000వ సంవత్సరం నుంచి 2004 వరకూ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగాడు..

PREV
17
ఆ టైమ్‌లో సౌరవ్ గంగూలీ లేకపోతే, పరిస్థితి ఇలా ఉండేది కాదు! - టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్
Mohammad Kaif

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కి చేరిన భారత జట్టు, ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచి సంచలనం క్రియేట్ చేసింది. 2002లో ఛాంపియన్స్ ట్రీఫీ విజేతగా నిలిచిన టీమిండియా, ఇంగ్లాండ్‌లో ట్రై సిరీస్ కూడా గెలిచింది..

27

అండర్‌ డాగ్స్‌గా 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీని ఆరంభించిన టీమిండియా, వరుస విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడినా ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ని డ్రా చేసుకుని... పాకిస్తాన్ పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్ విజయాలు అందుకుంది..

37

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి కుర్రాళ్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి, స్టార్లుగా ఎదిగారు. గంగూలీ కెప్టెన్సీలో టీమ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా కొనసాగుతూ వచ్చాడు మహ్మద్ కైఫ్..

47

‘సౌరవ్ గంగూలీ గురించి కచ్ఛితంగా చెప్పి తీరాలి. అతను ఓ అద్భుతమైన కెప్టెన్, అంతకుమించి చురుకైన లీడర్. కెప్టెన్‌ ఎప్పుడూ ముందుండి నడిపించాలి, సరైన ప్లేయర్లను ఎంచుకోవాలి, వారికి అండగా నిలుస్తూ వారి నుంచి మంచి పర్ఫామెన్స్ రాబట్టగలగాలి...

57

సౌరవ్ గంగూలీ అలాంటి టీమ్‌ని నిర్మించాడు. గంగూలీకి ముందు టీమిండియా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్‌ చీకటి రోజుల్లో టీమ్‌ని కుర్రాళ్లతో నింపాడు. సెహ్వాగ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్.. ఒక్కరేంటి, గంగూలీ కెప్టెన్సీలో టీమ్‌లోకి వచ్చిన అందరూ సూపర్ టాలెంటెడ్ ప్లేయర్లే..

67
Sourav Ganuly

క్రీజులోకి వెళ్లిన తర్వాత బెస్ట్ పర్ఫామెన్స్ ఉంటే, టీమ్‌లో నీకు ప్లేస్ ఉండేలా చూసుకునే బాధ్యత నాది.. అంటూ గంగూలీ, నాలో భరోసా నింపాడు. చెప్పినట్టే నాకు ఎన్నో మ్యాచుల్లో అవకాశం ఇచ్చాడు.

77

గంగూలీ, ఆ సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోకపోయి ఉంటే, టీమిండియా పరిస్థితి ఇలా ఉండేది కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్..  

click me!

Recommended Stories