పాక్ క్రికెటర్లు చీదరించుకున్నారు! అప్పుడు ధోనీ పిలిచి, నవ్వుతూ... పాక్ హీరోయిన్ మధిరా ఖాన్ కామెంట్స్..

First Published Jul 8, 2023, 4:06 PM IST

మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గురువుగా భావించిన సునీల్ గవాస్కర్ కూడా ధోనీ ఆటోగ్రాఫ్‌ని గుండెల మీద తీసుకున్నాడంటే మాహీ మానియా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు...


అజారుద్దీన్, గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి కెప్టెన్ల కెప్టెన్సీలో ఆడిన సచిన్ టెండూల్కర్ కూడా తాను ఆడిన బెస్ట్ కెప్టెన్ ధోనీయే అంటూ కితాబు ఇచ్చాడు. మాహీకి ఇంత క్రేజ్ రావడానికి అతని సక్సెస్ మాత్రమే కారణం కాదు... అంతకుమించి తన యాటిట్యూడ్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కూడా...
 

మహేంద్ర సింగ్ ధోనీకి పాకిస్తాన్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లను తమ వారిగా భావించి, అభిమానించే పాక్ క్రికెట్ ఫ్యాన్స్, ధోనీని ఇష్టపడడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే పాక్ సెలబ్రిటీలు కూడా మాహీకి వీరాభిమానులే..
 

Latest Videos


తాజాగా పాకిస్తాన్ నటి మధిరా ఖాన్, మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమానినంటూ ప్రకటించుకుంది. మాహీకి అంతగా అభిమానించడానికి కారణం కూడా ఉందంటూ 2008లో జరిగిన ఓ సంఘటనను బయటపెట్టింది మధిరా ఖాన్..
 


‘2008 ఆసియా కప్‌ సమయంలో ఇండియా, పాకిస్తాన్ పర్యటనకి వెళ్లింది. ఇరు జట్లు కూడా ఒకే హోటల్‌లో బస చేశాయి. అప్పుడు నా వయసు 15 ఏళ్లు ఉంటాయేమో. నేను కూడా క్రికెట్ టీమ్స్ ఉన్న హోటల్‌లోనే ఉన్నాను..

నేను పాక్ క్రికెటర్లను చూడగానే సంతోషంతో ఉండబట్టలేక, వెళ్లి నా ఫెవరెట్ క్రికెటర్‌ని ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగాను. అయితే అతను ‘నీకు సిగ్గు ఉందా.. నేను లంచ్ చేస్తున్నా కనిపించడం లేదా’ అంటూ విసుక్కున్నాడు..

ms dhoni

అతను అలా అరిచేసరికి నాకు ఒక్కసారిగా భయమేసింది. ఫెవరెట్ క్రికెటర్ అని ఆటోగ్రాఫ్ అడిగితే, ఇలా ఛీదరించుకుంటారా? అంటూ చాలా ఫీల్ అయ్యాను. అయితే అక్కడే ఉన్న మరో క్రికెటర్ నన్ను చూశాడు..

మేం కూడా క్రికెటర్లమే, కావాలనే నా ఆటోగ్రాఫ్ ఇస్తా అంటూ అన్నాడు. నాకు చాలా సంతోషమేసింది. అతనే ధోనీ. ఆయన నా క్యాప్ మీద ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాదు, నాతో చాలా సేపు నవ్వుతూ మాట్లాడారు. ఆ రోజు నుంచి నేను మాహీకి పెద్ద ఫ్యాన్‌ని అయిపోయా...

అప్పటికే మాహీ, టీ20 వరల్డ్ కప్ గెలిచారు. టీమిండియా కెప్టెన్‌గా ఎంతో సక్సెస్ సాధించారు. అయినా చాలా సింపుల్‌గా నవ్వుతూ పలకరించి, నా మనసు బాధపడకూడదని ఆలోచించాడు. మాహీలాంటి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది..’ అంటూ చెప్పుకొచ్చింది మధీరా ఖాన్..

click me!