రాహుల్ ద్రావిడ్‌ను ఒప్పించడానికి అవన్నీ చేయాల్సి వచ్చింది... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

First Published Dec 6, 2021, 10:07 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ ద్రావిడ్‌ను ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పించడానికి బీసీసీఐ... చాలా పెద్ద తతంగమే నడిపించాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

‘రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగుస్తుండడంతో టీమిండియా తర్వాతి హెడ్ కోచ్‌ ఎవరైతే బాగుంటుందనే విషయంలో చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాం. నేనైతే ఆ పొజిషన్‌కి రాహుల్ ద్రావిడ్ అయితేనే కరెక్ట్ అనుకున్నాం...

నా మనసులో ద్రావిడ్ ఆ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని ఉంది. జై షా (బీసీసీఐ సెక్రటరీ)తో కూడా ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను...

అయితే రాహుల్ మాత్రం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటే కనీసం 8 నుంచి 10 నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాలి...

ద్రావిడ్‌కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారితో గడపాలనే ఉద్దేశంతోనే రాహుల్ ద్రావిడ్, ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని స్వీకరించలేదు. అందుకే ద్రావిడ్ ఒప్పుకుంటాడనే నమ్మకమైతే మాకు లేదు...

ఎన్‌సీఏ హెడ్‌‌గా ఎంపికైన సమయంలో రాహుల్ ద్రావిడ్ ఇంటర్వ్యూ స్వయంగా మేమే తీసుకున్నాం. అప్పటి నుంచే హెడ్ కోచ్ పదవి స్వీకరించాల్సిందిగా ఆయనపై ఒత్తిడి తీసుకురావడం మొదలెట్టాం...

ఎలాగైనా ఒప్పించాలని మళ్లీ మళ్లీ అడుగుతూ విసిగించాం. ఎందుకైనా మంచిదని, టీమిండియా ప్లేయర్ల ఉద్దేశాన్ని కూడా అడిగాం. టీమిండియా తర్వాతి కోచ్‌గా ఎవరైతే బాగుంటుందని అభిప్రాయం స్వీకరించాం..

టీమిండియా ప్లేయర్లు అందరూ రాహుల్ ద్రావిడ్‌కే ఓటు వేశారు. ఆ విషయాన్ని ద్రావిడ్‌కి చెప్పాం. నువ్వు రావాలని, జట్టు ఎంతలా కోరుకుంటుందో చూడమని చెప్పాం...

ఆఖరికి నేనే స్వయంగా అతన్ని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశాను. కనీసం రెండేళ్లు ఈ బాధ్యత తీసుకొమ్మని సూచించా... అన్ని చేస్తే కానీ రాహుల్ ద్రావిడ్, ఈ పదవి తీసుకోవడానికి అంగీకరించలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ...

రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌ను స్వదేశంలో 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది భారత జట్టు...

కాన్పూర్ టెస్టులో ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని కోల్పోయిన టీమిండియా, ముంబై టెస్టులో ఘన విజయం దిశగా సాగుతోంది. 

click me!