గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ వరల్డ్‌కప్ గెలవలేదు, వాళ్లు చెడ్డ ప్లేయర్లు అయిపోతారా... రవిశాస్త్రి కామెంట్స్...

First Published Jan 25, 2022, 2:06 PM IST

ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోతున్నాడనే కారణంగా విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ బోర్డు. ఈ నిర్ణయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి...

‘విరాట్ కోహ్లీ టాప్ క్లాస్ కెప్టెన్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కూడా. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి చెప్పడానికి అతను సాధించిన విజయాలు చాలు...

ఇంతకుముందెన్నడూ ఏ కెప్టెన్ కూడా సాధించలేకపోయిన విజయాలను విరాట్ కోహ్లీ, టీమిండియాకి పరిచయం చేశాడు. టీమిండియాని నెం.1 టీమ్‌గా నిలిపాడు...

ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలు గెలిస్తేనే బెస్ట్ కెప్టెన్ అనడం మూర్ఖత్వమే అవుతుంది. సచిన్ టెండూల్కర్‌కే వరల్డ్‌కప్ గెలవడానికి ఆరు టోర్నీలు ఆడాల్సి వచ్చింది...

సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ఎందరో ప్లేయర్లు, వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా కూడా ఉండలేకపోయారు...

భారత జట్టుకి ఉన్నది ఇద్దరే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్లు. అలాగని మిగిలిన కెప్టెన్లు చేసిన సేవలను, అందించిన విజయాలను తక్కువ అంచనా వేయలేం కదా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2003 టోర్నీలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్‌కి దూసుకెళ్లింది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి, రన్నరప్‌గా నిలిచింది...

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2007 టోర్నీలో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు రాహుల్ ద్రావిడ్. టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన రాహుల్ ద్రావిడ్ టీమ్... గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడి, ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది...

టీమిండియా తరుపున 86 వన్డేలు, 134 టెస్టులు ఆడిన వీవీఎస్ లక్ష్మణ్, తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఒక్క ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో కూడా ఆడకపోవడం రికార్డు...

1992 వరల్డ్ కప్ టోర్నీ నుంచి భారత జట్టుకి ఆడుతున్న సచిన్ టెండూల్కర్, 2011లో ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు...

click me!