ఆటగాళ్ల కంటే ఆట గొప్పది.. అది గుర్తుంచుకోండి.. కెప్టెన్ల వ్యవహారంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్

Published : Dec 15, 2021, 01:26 PM IST

Virat Kohli-Rohit Sharma: టీమిండియా పరిమిత ఓవర్ల, టెస్టు జట్టు సారథుల వ్యవహారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి దాకా వెళ్లింది. విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల  వైఖరిపై అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
17
ఆటగాళ్ల కంటే ఆట గొప్పది.. అది గుర్తుంచుకోండి.. కెప్టెన్ల వ్యవహారంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్

భారత క్రికెట్ లో ప్రకంపనలు రేపుతున్న వన్డే కెప్టెన్సీ  వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా లేదు.  దీనిపై సీనియర్లు, మాజీలు, తాజాలు ఎవరికి నచ్చిన విధంగా వారు మాట్లాడుతున్నారు. బీసీసీఐ నిర్ణయంపై ప్రశంసలు ఎన్ని వస్తున్నాయో విమర్శలు అందుకు డబుల్ వస్తున్నాయి.

27

వన్డేలలో విజయవంతమైన సారథిగా  పేరున్న విరాట్ ను కాదని  రోహిత్ శర్మ ను  నాయకుడిగా ఎంపిక చేయడంపై బీసీసీఐపై కోహ్లీ గుర్రుగా ఉన్నాడని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే అతడు త్వరలో దక్షిణాఫ్రికా లో టెస్టుల తర్వాత జరుగబోయే వన్డేలకు కూడా అందుబాటులో ఉండటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. 

37

ఈనేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఈ వ్యవహారంపై  స్పందించాడు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఆట కంటే ఆటగాళ్లు గొప్పోళ్లు కాదు..’ అని అన్నాడు. విరాట్  కోహ్లీ గానీ రోహిత్ శర్మ గానీ బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే విధంగా  ఠాకూర్ మాట్లాడారు. 

47

అయితే ఇందుకు సంబంధించిన వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తుండటం.. ఇద్దరు కెప్టెన్ల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రస్థాయిలో హెచ్చరిల్లాయని వార్తలు  వస్తున్న నేపథ్యంలో  ఠాకూర్ స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకోవాలి..’  అని సూచించారు. 

57

ఇదిలాఉండగా మరోవైపు  వన్డేల నుంచి విరాట్ విశ్రాంతి తీసుకుంటున్నాడనే వార్తలు వట్టి పుకార్లేనని బీసీసీఐ తెలిపింది. ఇందుకు సంబంధించి తమకు  ఎలాంటి సమాచారం అందలేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

67

సదరు అధికారి మాట్లాడుతూ.. ‘ఇప్పటికైతే కోహ్లీ నుంచి బీసీసీఐ చీఫ్ గంగూలీకి గానీ, కార్యదర్శి జై షా కు గానీ ఎలాంటి  (వన్డేలలో విశ్రాంతి గురించి) విన్నపం రాలేదు. ఒకవేళ వస్తే దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం..’ అని తెలిపాడు. 

77

విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ ల వ్యవహారంపై చర్చ ఎక్కువవుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో ఆందోళన పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ.. ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశముంది. ఈ సమావేశంలో అతడు ఈ రూమర్లకు చెక్ పెట్టే అవకాశం కనిపిస్తున్నది.

Read more Photos on
click me!

Recommended Stories