Published : Sep 03, 2022, 07:02 PM ISTUpdated : Sep 03, 2022, 07:04 PM IST
బీసీసీఐ అధ్యక్షుడగా ఉన్న సౌరవ్ గంగూలీ, త్వరలో బ్యాటు పట్టబోతున్నట్టు కొన్నిరోజుల కిందట ప్రకటించడంతో అభిమానులు ఫుల్లు ఖుషీ అయిపోయారు. అప్పుడెప్పుడో 14 ఏళ్ల క్రిందట దాదా బ్యాటింగ్ చూసిన అభిమానులు, ఎప్పుడెప్పుడు మళ్లీ గంగూలీ బ్యాటింగ్‌ని చూస్తామా? అని ఆశగా ఎదురుచూశారు... కానీ ఇది ఆ ఫ్యాన్స్‌కి నిజంగా చేదు వార్తే...
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ, త్వరలో ప్రారంభం కాబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో పాల్గొనాలని భావించాడు. ‘అజాదీకా మహోత్సవ్ కోసం ఫండ్స్ వసూలు చేసేందుకు ఓ ఛారిటీ మ్యాచ్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాం. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడంమే కావడంతో మహిళా సంక్షేమం కోసం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ద్వారా నిధులు వసూలు చేయబోతున్నాం...’ అంటూ ఇన్‌స్టాలో జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న వీడియో పోస్టు చేశాడు సౌరవ్ గంగూలీ...
25
సెప్టెంబర్ 16న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియన్ మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ ఎలెవన్ మధ్య జరిగే మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ఆడబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రొఫెషనల్ కమ్మిట్‌మెంట్స్, ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు సౌరవ్ గంగూలీ...
35
Image credit: LLC/Twitter
‘లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీకి నా బెస్ట్ విషెస్. రిటైర్ అయిన క్రికెటర్లను మళ్లీ క్రీజులోకి తీసుకొచ్చి, అభిమానులను సంతోషపెట్టాలనేది చాలా చక్కని ఆలోచన. ఈ లీగ్‌లో నేను ఓ మ్యాచ్ ఆడాలని అనుకున్నాను. అయితే నా ప్రొఫెషనల్ కమ్మిట్‌మెంట్స్, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో నిరంతర పని కారణంగా ఈ గేమ్ నేను ఆడడం లేదు...
45
Image credit: LLC/Facebook
లెజెండ్స్ లీగ్ క్రికెట్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. నేను ఈ మ్యాచ్ ఆడకపోయినా ఆ రోజు ఈడెన్ గార్డెన్స్‌కి వచ్చి మ్యాచ్‌ని చూస్తాను...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
55
Image credit: PTI
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మొదటి మ్యాచ్ వచ్చే ఆదాయాన్నిమొత్తాన్ని కపిల్‌దేవ్ ‘ఖుషీ ఫౌండేషన్’కి విరాళంగా ఇవ్వబోతున్నారు. ఈ ఫౌండేషన్ ఆడపిల్లల వికాసానికి, విద్యకు సహాయం చేస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌తో పాటు 10 దేశాల మాజీ క్రికెటర్లు పాల్గొనబోతున్నారు.