బ్యాక్ టు పెవిలియన్... ఐపీఎల్‌లోకి సౌరవ్ గంగూలీ రీఎంట్రీ! ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా దాదా...

First Published Jan 3, 2023, 3:53 PM IST

బీసీసీఐ బాస్‌గా రెండేళ్ల పాటు చక్రం తిప్పిన సౌరవ్ గంగూలీ, తిరిగి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు గంగూలీ. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి హెడ్ కోచ్‌గా, మెంటర్‌గా వ్యవహరించాడు సౌరవ్ గంగూలీ...
 

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో పాటు ఐఎల్‌టీ20 (ఇంటర్నేషనల్ లీగ్ టీ20) దుబాయ్ క్యాపిటల్స్, అలాగే సౌతాఫ్రికాటీ20 లీగ్‌‌లో ప్రెటోరియా క్యాపిటల్స్ టీమ్‌కి డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నాడు సౌరవ్ గంగూలీ...

‘అవును, సౌరవ్ గంగూలీ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రాబోతున్నారు. ఆయనతో జరుపుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో ఆయన పనిచేశారు, ఈ ఫ్రాంఛైజీతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఆయన్ని ఒప్పించాం...’ అంటూ చెప్పుకొచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సభ్యులు...
 

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ ముందున్న ప్రధాన సమస్య రిషబ్ పంత్‌ స్థానంలో కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయడం. గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్, కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతను కోలుకోవడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని సమాచారం..

రిషబ్ పంత్ ప్లేస్‌లో డేవిడ్ వార్నర్‌కి కెప్టెన్సీ అప్పగిస్తారా? లేక అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పృథ్వీ షాకి కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాతి కోచ్‌ని నిర్ణయించే బాధ్యత సౌరవ్ గంగూలీపైనే పడింది...

Sourav Ganguly-Jay shah

కరోనా లాక్‌డౌన్ టైంలో ఐపీఎల్ 2020 సీజన్‌ని విజయవంతంగా నడిపించి, కోవిడ్ కారణంగా 2021 సీజన్‌కి బ్రేక్ పడినా రెండు ఫేజ్‌లుగా పూర్తి చేశాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. 2022లో కొత్త ఫ్రాంఛైజీలను తీసుకొచ్చి, 2023-27 ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయం ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని బీసీసీఐ ఖజానాలో నింపాడు గంగూలీ...

Sourav Ganguly-Virat Kohli

అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించడం, సౌరవ్ గంగూలీ మెడకు చుట్టుకుంది. దీంతో సౌరవ్ గంగూలీని బలవంతంగా బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది భారత క్రికెట్ బోర్డు. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న గంగూలీ, ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. 

click me!