‘దాదా’ సౌరవ్ గంగూలీ బయోపిక్... ప్రొడ్యూసర్‌ని కూడా కన్ఫార్మ్ చేసిన బీసీసీఐ బాస్..

First Published Sep 9, 2021, 2:44 PM IST

క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ .., మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు ‘దాదా’ సౌరవ్ గంగూలీ జీవితకథ ఆధారంగా రూపొందనున్న బయోపిక్ మూవీ... తన బయోపిక్ మూవీ వస్తుందని కొన్నాళ్ల క్రితం ప్రకటించిన దాదా, తాజాగా ప్రొడ్యూసర్‌ను కూడా ప్రకటించాడు...

‘క్రికెట్ నా జీవితం, అది నాకు జీవితంపై నమ్మకాన్ని, తలఎత్తి ముందుకు నడిచే ధైర్యాన్ని ఇచ్చింది. నా క్రికెట్ జర్నీ ఎంతో ఉత్సాహాంగా సాగింది... నా జీవితకథపై ఎల్‌యూవీ ఫిల్మ్స్ బయోపిక్ నిర్మిస్తుండడం థ్రిల్లింగ్‌గా ఉంది...’ అంటూ ట్వీట్ చేశాడు సౌరవ్ గంగూలీ...

‘సూనూ కే టికు కీ స్వీటీ’, ‘దే దే ప్యార్ దే’, ‘జై మమ్మీ దీ’, ‘మలాంగ్’, ‘ఛలాంగ్’ వంటి సినిమాలు నిర్మించిన ఎల్‌యూవీ ఫిల్మ్... ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్‌లతో సినిమాలు నిర్మిస్తోంది...

ఎట్టకేలకు తన బయోపిక్ రూపొందించడానికి అంగీకరించిన సౌరవ్ గంగూలీ... ‘అవును, నేను నా బయోపిక్‌కి అంగీకరించాను. అది బాలీవుడ్‌లో వస్తుంది. డైరెక్టర్ పేరు ఇప్పుడే చెప్పలేను. కొన్నిరోజుల్లో అన్ని వివరాలు బయటికి వస్తాయి... నా బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ అయితే బాగుంటాడని అనుకుంటున్నా’ అంటూ తెలిపాడు...

ఇదివరకే సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ మూవీలో జీవించేసిన రణ్‌బీర్ కపూర్, సౌరవ్ గంగూలీ రోల్‌లో లీనమైపోతాడని చెప్పాల్సిన అవసరం లేదు... సంజూ మూవీని డైరెక్ట్ చేసిన రాజ్‌కుమార్ హిరాణీయే ‘దాదా’ మూవీని డైరెక్ట్ చేస్తాడని టాక్ వినబడుతోంది

మిగిలిన క్రికెటర్లతో పోలిస్తే భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ జీవితం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని భారత జట్టు అష్టకష్టాలు పడుతున్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు గంగూలీ...

క్రికెటర్ల జీవితాలపై బాలీవుడ్‌లో బయోపిక్‌లు తెరకెక్కడం చాలా ఏళ్లుగా జరుగుతున్నదే. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ- ఎమ్మెస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ, సచిన్ టెండూల్కర్ - సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్, మహ్మద్ అజారుద్దీన్ - అజర్ బయోపిక్స్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టాయి. 

మొట్టమొదటి వరల్డ్‌కప్ హీరో కపిల్‌దేవ్ బయోపిక్ - 83 త్వరలో రానుంది. ఇప్పుడు ఈ లిస్టులో ‘దాదా’ సౌరవ్ గంగూలీ కూడా చేరాడు. అయితే మిగిలిన క్రికెటర్ల కంటే గంగూలీ జీవితం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది...

‘సచిన్ టెండూల్కర్ బయోపిక్ తీస్తే, అది ‘మాస్టర్’ క్రికెట్‌లో ఎదిగిన విధానాన్ని చూపిస్తుంది... అలాగే ధోనీ బయోపిక్‌లో మాహీ ఎదిగిన విధానం మాత్రమే తెలుస్తుంది. అదే గంగూలీ బయోపిక్ తీస్తే, అది భారత జట్టు ఎదిగిన పరిస్థితులను చూపిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

సెహ్వాగ్ చెప్పినట్టుగానే సచిన్ బయోపిక్‌లో టెండూల్కర్ గురించి, ఎమ్మెస్ ధోనీ బయోపిక్‌లో మాహీ గురించి తప్ప మిగిలిన ఏ విషయాలు పెద్దగా చూపించలేదు. అయితే సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో మాత్రం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, ఎమ్మెస్ ధోనీ వంటి ప్లేయర్లను చూపించడం తప్పనిసరి...

‘దాదా - ది బెంగాల్ టైగర్’ అనే పేరు ప్రచారంలో ఉన్న సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేవరకూ జరిగిన సంఘటనలను చూపించబోతున్నారని టాక్ వినబడుతోంది...

‘బెంగాల్ టైగర్’గా, ‘ప్రిన్స్ ఆఫ్ బెంగాల్’, ‘దాదా’గా అభిమానుల మనసులు గెలుచుకున్న గంగూలీ, ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే లార్డ్స్‌లో భారీ సెంచరీ చేసి, అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు...

ఆరంగ్రేటం తర్వాత ఐదేళ్ల పాటు 1300+ వన్డే పరుగులు సాధించి, క్రికెట్ ప్రపంచంలో ఎంట్రీని ఘనంగా చాటాడు. ఆ తర్వాత కెప్టెన్‌గా జట్టు మొత్తాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకోవడం, ఒకే టీమ్‌ను కొనసాగించడం, లార్డ్స్ బాల్కనీ చొక్కా విప్పిన ఎపిసోడ్...

2003 వన్డే వరల్డ్‌కప్... ప్రేమ, పెళ్లి, నగ్మాతో ఎఫైర్ నడిపాడంటూ వచ్చిన వార్తలు, సచిన్ టెండూల్కర్‌తో అనుబంధం, ఫారిన్ క్రికెటర్లకు తన స్టైల్‌లో సమాధానం ఇచ్చిన దూకుడు...

‘గంగూలీ బ్యాటింగ్‌ని మ్యాగీ వండడంతో పోలుస్తూ వచ్చిన విమర్శలు, కోచ్‌గా గ్రేగ్ చాపెల్ నియామకం, ఆ తర్వాత కెప్టెన్సీ కోల్పోయి, జట్టుకు దూరమైన ఎపిసోడ్... కసిగా తిరిగి జట్టులో దాదా రీఎంట్రీ...

మధ్యలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి యంగ్ గన్స్‌ను గంగూలీ ప్రోత్సాహించిన విధానం, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, కరోనా సమయంలో ఐపీఎల్ 2020 నిర్వహణ... ఇలా ‘దాదా’ జీవితంలో ఊహించని మలుపులు, ఎత్తుపల్లాలు ఎన్నో ఉన్నాయి..

అగ్రెసివ్ కెప్టెన్ అంటే అందరికీ విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తాడు, ఇంటెలిజెంట్ కెప్టెన్ అంటే మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకువస్తాడు... అయితే ఈ రెండు కలగలిపిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ... కోహ్లీలా అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో, ధోనీలా ఇంటెలిజెంటె కెప్టెన్సీ ఉండే దాదా బయోపిక్‌లో ఏయే కొత్త విషయాలు బయటికి వస్తాయో చూడాలి...

click me!