ఆ ముగ్గురికీ అవకాశం రాకపోవడానికి ఆమే కారణమా... చాహాల్ భార్య ధనశ్రీపై ట్రోలింగ్...

First Published Sep 9, 2021, 1:07 PM IST

క్రికెట్‌లో కొన్ని సెంటిమెంట్లు, మరికొన్ని మూఢనమ్మకాలు చాలా కామన్. విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినప్పుడు, దానికి అనుష్క శర్మను కారణంగా చూపిస్తూ, విపరీతమైన ట్రోలింగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పొజిషన్‌లోనే చిక్కుకుంది యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ...

టీమిండియా గత 10 టీ20 సిరీసుల్లో తొమ్మిదింట్లో ఘన విజయాలు అందుకుంది... శ్రీలంకతో జరిగిన గత టీ20 సిరీస్ కూడా కరోనా కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది...

గత 9 టీ20 సిరీస్‌ల్లో 17 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్, టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఉన్నాడు...

19 వికెట్లు తీసిన దీపక్ చాహార్, 23 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్‌లకు జట్టులో చోటు దక్కలేదు, కానీ స్టాండ్ బై ప్లేయర్లుగా యూఏఈ వెళ్లే అవకాశం దొరికింది...

నాలుగేళ్ల క్రితం టీ20 టీమ్‌కి దూరమైన రవిచంద్రన్ అశ్విన్‌ని, తిరిగి జట్టులోకి పిలిచిన సెలక్టర్లు... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న చాహాల్‌ను మాత్రం పక్కనబెట్టారు...

టీ20 వరల్డ్‌కప్‌ 2021లో యజ్వేంద్ర చాహాల్‌కి ధనశ్రీ వర్మయే కారణమంటూ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ధనశ్రీ వర్మతో పెళ్లైన తర్వాత చాహాల్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడాడు...

ఆ మ్యాచ్‌లో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా గాయపడిన రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన యజ్వేంద్ర చాహాల్, మూడు వికెట్లు తీసి... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు...

అయితే ఆ తర్వాత మళ్లీ అదే ఫెయిల్యూర్. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచులు ఆడిన యజ్వేంద్ర చాహాల్, మూడు వికెట్లు మాత్రమే తీశాడు... 10+ యావరేజ్‌తో పరుగులు సమర్పించాడు...

ఐపీఎల్ 2021 ఫేజ్ 1లోనూ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. ఈ కారణంగానే అతనికి టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కలేదు...

యూట్యూబర్, కొరియోగ్రాఫర్, టిక్ టాక్ డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ... యజ్వేంద్ర చాహాల్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత వీరి వివాహం జరిగింది...

ధనశ్రీ వర్మతో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్ కూడా ఆడిపాడారు. అన్యూహ్యంగా టీ20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌లో కచ్ఛితంగా ఉంటారని భావించిన ఈ ముగ్గురికీ చోటు దక్కలేదు...

గాయపడిన శ్రేయాస్ అయ్యర్‌, శార్దూల్ ఠాకూర్‌ను స్టాండ్ బై ప్లేయర్లుగా అయినా ఎంపిక చేసిన సెలక్టర్లు, శిఖర్ ధావన్‌ను అస్సలు పట్టించుకోలేదు...

ఈ సంఘటనలతో ధనశ్రీ వర్మ పెద్ద ఐరన్ లెగ్ అంటూ, ఆమె పెళ్లాడిన చాహాల్‌తో పాటు, తనతో డ్యాన్స్ చేయడం వల్లే శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ టీ20 వరల్డ్‌కప్ జట్టుకి దూరమయ్యారంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు...

click me!