ముంబై ఇండియన్స్ నుంచి ఆరుగురు, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముగ్గురు... టీ20 వరల్డ్‌కప్‌ 2021లో...

First Published Sep 9, 2021, 1:39 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అయితే అన్నింటికీ భిన్నంగా ఓ విషయం మాత్రం ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో ఏకంగా ఆరుగురు ప్లేయర్లు... ముంబై ఇండియన్స్ జట్టుకి చెందినవారే కావడం విశేషం...

ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

రోహిత్‌తో పాటు వికెట్ కీపర్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా... ముంబై ఇండియన్స్‌కి చెందినవారే...

వీరితో పాటు యంగ్ స్పిన్నర్ రాహల్ చాహార్‌కి కూడా టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల పరంగా చూసుకుంటే, ముంబై ఇండియన్స్ నుంచే అత్యధిక ప్లేయర్లు వరల్డ్‌కప్ ఆడబోతున్నారు...

ఐపీఎల్ 2020 రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముగ్గురు ప్లేయర్లకు టీ20 వరల్డ్‌కప్ ఆడే అవకాశం దక్కింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు స్పిన్నర్లు రవి అశ్విన్, అక్షర పటేల్‌లకు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది...

వీరితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కి కూడా స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు దక్కింది. అయితే ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్‌లకు మాత్రం నిరాశే ఎదురైంది..

పంజాబ్ కింగ్స్ నుంచి ఇద్దరు ప్లేయర్లు, టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికయ్యారు. కెఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు టీ20 వరల్డ్‌కప్ ఆడే అదృష్టం దక్కగా, మయాంక్ అగర్వాల్‌కి నిరాశే ఎదురైంది..

విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్‌సీబీ నుంచి ఈసారి ఒకే ఒక్క ప్లేయర్, టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్నాడు... అదీ విరాట్ కోహ్లీయే...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లైన యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్‌లకు ఈసారి నిరాశే ఎదురైంది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఒకే ఒక్క ప్లేయర్ టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆడబోతున్నాడు. భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌, బుమ్రాతో కలిసి ఓపెనింగ్ బౌలింగ్ చేయనున్నాడు...

మూడు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి ఒకే ఒక్క ప్లేయర్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆడబోతున్నాడు... అతను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా...

జడ్డూతో పాటు బౌలర్ దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్‌... స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికైతే, ఎమ్మెస్ ధోనీ మెంటర్‌గా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో కనిపించబోతున్నాడు...

రెండు సార్లు టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్‌ వరుణ్ చక్రవర్తి మాత్రమే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆడబోతున్నాడు... 

ఓవరాల్‌గా ముంబై నుంచి ఆరుగురు, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముగ్గురు, పంజాబ్ కింగ్స్ నుంచి ఇద్దరు... ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే, కేకేఆర్ జట్ల నుంచి ఒక్కో ప్లేయర్ టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్నారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఒక్క ప్లేయర్‌కి కూడా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో చోటు దక్కలేదు...
 

click me!