విరాట్ కెప్టెన్‌గా పనికి రాడు, ఆ తాగుబోతును తీసేయండి... భారత జట్టులో మార్పులు అనివార్యమేనా?

First Published Dec 19, 2020, 12:48 PM IST

ఒకే ఒక్క చెత్త ప్రదర్శన... అప్పటిదాకా ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చేయవచ్చు. పింక్ బాల్ టెస్టులో పైచేయి సాధించిందని అనుకున్న టీమిండియాకి మూడో రోజు మొదటి గంటలోనే ఊహించని షాక్ తగిలింది. 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి, టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు క్రియేట్ చేసింది. భారత జట్టు మరిచిపోలేని పీడకలగా మారిన పింక్ బాల్ టెస్టు రెండో ఇన్నింగ్స్... భారత జట్టులో సమూల మార్పులు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది.

కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. ఆడిలైడ్ డిజాస్టర్ తర్వాత ఆ విమర్శలు మరింతగా పెరిగాయి.
undefined
వెంటనే విరాట్ కోహ్లీని భారత జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు...
undefined
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన లోయెస్ట్ స్కోరు 48 పరుగులను కూడా అందుకోలేకపోయిందంటే విరాట్ సేన... ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కుంటుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.
undefined
11 మంది బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి...
undefined
ఇంతకుముందు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య 1924లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ అందరూ డబుల్ డిజిట్ స్కోరు చేయకుండానే అవుట్ అయ్యారు.
undefined
భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నమోదుచేసిన అత్యధిక భాగస్వామ్యం 8 పరుగులు. బుమ్రా, మయాంక్ కలిసి రెండో వికెట్‌కి 8 పరుగులు జోడించారు. 1955 తర్వాత డబుల్ డిజిట్ భాగస్వామ్యం కూడా నమోదుకాకుండా ఇన్నింగ్స్ ముగియడం ఇదే తొలిసారి.
undefined
నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన బౌలర్ బుమ్రా 17 బంతులు ఎదుర్కొంటే, పూజారా, కోహ్లీ, రహానే అందులో సగం బంతులు కూడా ఫేస్ చేయలేకపోయారు.
undefined
వరుసగా ఫెయిల్ అవుతున్న పృథ్వీషాకి అవకాశం ఇచ్చే బదులు, కెఎల్ రాహుల్ లేదా శుబ్‌మన్ గిల్‌కి తుది జట్టులో అవకాశం ఇచ్చి ఉంటే... భారత జట్టుకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చాలామంది అభిప్రాయం.
undefined
విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా పృథ్వీషాను బ్యాకప్ చేస్తూ వచ్చిన హెడ్‌కోచ్ రవిశాస్త్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి...
undefined
పృథ్వీషా బ్యాటింగ్ చేస్తుంటే సచిన్, సెహ్వాగ్, లారా కనిపిస్తున్నారని రవిశాస్త్రి చేసిన కామెంట్లు వింటేనే, భారత జట్టు ఎంపికపై అతనికి ఎంత క్లారిటీ ఉందో అర్థమవతుందని విమర్శిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
undefined
క్రికెట్ కంటే ఎక్కువగా పార్టీల గురించి, మందు గురించి ఆలోచించే రవిశాస్త్రి లాంటివాళ్లు కోచ్‌గా ఉంటే టీమిండియా పరిస్థితి ఇంత కంటే మెరుగ్గా ఎలా ఉంటుందని తీవ్రస్థాయిలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
undefined
1974లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో 42 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. 56 ఏళ్ల కిందటి ఈ చెత్త రికార్డును విరాట్ సేన తుడిచిపెట్టేసింది...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన జోష్ హజల్‌వుడ్... 3 మెయిడిన్లతో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు హజల్‌వుడ్.
undefined
10.2 ఓవర్లు బౌలింగ్ చేసి 4 టాపార్డర్ వికెట్లు తీసిన ప్యాట్ కమ్మిన్స్... టెస్టుల్లో 150 వికెట్లను పూర్తిచేసుకున్నాడు...
undefined
అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క సెంచరీ కూడా చేయకుండా ఈ ఏడాదిని ముగించాడు విరాట్ కోహ్లీ.
undefined
2008లో 5 వన్డేలు మాత్రమే ఆడిన కోహ్లీ, మొదటి ఏడాది సెంచరీ చేయలేకపోయాడు. ఈ ఏడాది 3 టెస్టులు, 9 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ నుంచి ఒక్క సెంచరీ రాలేదు.
undefined
click me!