భారీ అంచనాలతో ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టిన భారత బౌలింగ్ విభాగం... టూర్‌లో మొట్టమొదటిసారి అంచనాలకు తగ్గట్టుగా అదరగొట్టింది. పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ ఇస్తూ... మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీయడంతో పాటు బుమ్రా, ఉమేశ్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో మొదటి ఇన్నింగ్స్ 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా...టీమిండియాకి 53 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.