టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్... వరుస విజయాలతో ఊపు మీదున్న...

First Published Sep 9, 2021, 12:19 PM IST

వరుసగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటా టాప్ టీమ్‌లను చిత్తు చేసి, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుని చరిత్ర క్రియేట్ చేసింది బంగ్లాదేశ్. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు వరుస విజయాలతో దూసుకుపోతున్న బంగ్లా... ఈ ఏడాది అత్యధిక విజయాలను అందుకున్న టీ20 టీమ్‌గానూ నిలిచింది...

తాజాగా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి, టీ20 సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైన 19 మందిలో నలుగురిని తొలగించి, అదే జట్టును టీ20 వరల్డ్‌కప్‌ 2021 కోసం యూఏఈ పంపనుంది బంగ్లాదేశ్...

ఆఫ్ఘాన్ సంచలన పర్ఫామెన్స్ కారణంగా టీ20 వరల్డ్‌కప్‌ 2021లో సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన బంగ్లాదేశ్, గ్రూప్ స్టేజ్‌లో ఓమన్, పపువా న్యూ గినీ, స్కాట్లాండ్ జట్లతో పోటీపడనుంది. ఈ గ్రూప్ దశలో టాప్‌లో నిలిచిన రెండు జట్లు, సూపర్ 12కి అర్హత సాధిస్తాయి...

అక్టోబర్ 17న స్కాట్లాండ్‌తో మొదటి మ్యాచ్ ఆడే బంగ్లాదేశ్... 19న ఓమన్‌తో, 21న పపువా న్యూ గినీలతో మ్యాచులు ఆడుతుంది...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందే స్వదేశంలో ప్రత్యర్థులపై విరుచుకుపడిన బంగ్లా పులులు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసి టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి బంగ్లాదేశ్ జట్టు ఇదే: మహ్మదుల్లా (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రహీం, సౌమ్యా సర్కార్, లిటన్ దాస్, అఫిఫ్ హుస్సేన్, మహ్మద్ నయీం, నురుల్ హసన్ సోహన్, సమీమ్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కీన్ అహ్మద్, మహ్మద్ సైఫుద్దీన్, షరీఫుల్ ఇస్లాం, మెహడీ హసన్, నసుమ అహ్మద్...

రిజర్వు ప్లేయర్లుగా అమినుల్ ఇస్లాం, రూబెల్ హుస్సేన్‌, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం యూఏఈ పయనం కానున్నారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాల్గొననున్న ఓమన్ కూడా జట్టును ప్రకటించింది. జీసన్ మక్సూద్‌ కెప్టెన్‌గా వ్యవహరించే ఓమన్ జట్టులో సురజ్ కుమార్, ఆయాన్ ఖాన్, సందీప్ గౌడ్, జితేందర్ సింగ్ వంటి భారతీయులకు కూడా చోటు దక్కింది...

టీ20 వరల్డ్‌కప్ 2021కి ఓమన్ జట్టు: జీసన్ మక్సూద్ (కెప్టెన్), అకిబ్ ఇలియాస్, జితేందర్ సింగ్, ఖవర్ ఆలీ, మహ్మద్ నదీం, ఆయాన్ ఖాన్, సురజ్ కుమార్, సందీప్ గౌండ్, నెస్తర్ దాంబ, ఖలీముల్లా, బిలాల్ ఖాన్, నసీం ఖుషీ, సుఫ్యాన్ మహ్మద్, ఫయాజ్ భట్, ఖుర్రాం ఖాన్

click me!